»Sugar Test Ghagar Test Without Taking Blood How Is It
Sugar Test: రక్తం తీయకుండానే ఘగర్ టెస్ట్.. ఎలా అంటే?
మధుమేహం వ్యాధిని గుర్తించాలంటే సూదితో గుచ్చి శరీరంలోని రక్తం తీసి టెస్ట్ చేస్తారు. అయితే ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి ఇలా రక్తంతో కాకుండా చెమతో చెక్ చేసుకునే పరికరం కనిపెట్టారు.
Sugar Test: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. పెద్దవాళ్ల నుంచి చిన్నపిల్లల వరకు చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధిని గుర్తించాలంటే సూది గుచ్చి శరీరంలోని రక్తాన్ని తీసి టెస్ట్ చేయాలి. అలా కాకుండా ఒక పరికరంతో మధుమేహం సమస్య గురించి తెలుసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఈ పరికరంతో ఎలాంటి నొప్పి లేకుండా చెక్ చేసుకోవచ్చు. కేవలం చెమట ద్వారా మధుమేహాన్ని నిర్ధారించే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని కనుగొన్నారు. దీనిని రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ తాజాగా అనుమతి ఇచ్చింది.
ఏలూరుకి చెందిన పూసా చీరంజీవి శ్రీనివాసరావు ఈ పరికరాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా యూనివర్సిటిలో పీజీ, తర్వాత పీహెచ్డీ చేసిన ఇతను ప్రస్తుతం ఐఐటీ కాన్పూర్‌లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నిర్థారించడానికి రక్తాన్ని తీయనవసరం లేకుండా చెమను పరీక్షించి ఈ పరికరంతో నిమిషంలో మధుమేహాన్ని గుర్తించవచ్చు.