Harish raoపై సిదిరి చిందులు.. నీలా, నీ మామాలా అంటూ కౌంటర్ అటాక్
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌తోపాటు సీఎం కేసీఆర్, పార్టీ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
Sidiri appalraju:ఏపీ డెవలప్ కాలేదని, ఇక్కడే ఓట్లు తీసుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు (harish rao) చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageshwara rao) కౌంటర్ ఇవ్వగా.. మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) కూడా స్పందించారు. ఈ రోజు మరో మంత్రి సిదిరి అప్పలరాజు (sidiri appalraju) రియాక్ట్ అయ్యారు. మంత్రి హరీశ్ రావు (harish rao), సీఎం కేసీఆర్ (kcr), పార్టీ గురించి తీవ్ర విమర్శలు చేశారు.
ప్రాంతీయ వాదాన్ని ఎగదోసి తెలంగాణ నాయకులు అయ్యారని సిదిరి అప్పలరాజు (sidiri appalraju) స్టార్ట్ చేశారు. కేసీఆర్ కుటుంబంలో (kcr family) జాతీయ వాదం లేదని.. ప్రాంతీయ ఉగ్రవాదులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీని బీఆర్ఎస్ అని మారిస్తే సరిపోతుందా అని అడిగారు. ఇప్పటికీ తెలంగాణలో దొరల పాలన సాగుతోందని విమర్శించారు. కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అని చెప్పారు.
ఆంధ్రుల కష్టంతో మహానగరంగా మారిన హైదరాబాద్‌ను (hyderabad) ఉన్న ఫళంగా విడిచి వచ్చామని సిదిరి అప్పలరాజు గుర్తుచేశారు. ఇక్కడ చంద్రబాబు (chandrababu) దరిద్రం ఉండనే ఉంది అని బాబును కూడా వదల్లేదు. మాకు ఫామ్ హౌస్ (farm house) లేదు.. మీ మామ లాగా కల్లు తాగడం లేదని చెప్పాడు. కవితక్క లాగా సీక్రెట్ చాట్స్ లేవన్నారు. లిక్కర్ స్కామ్ లేదని చెబుతున్నాడు. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హరీశ్ రావుకు (harish rao) గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.
సంగారెడ్డిలో కార్మికులతో మంత్రి హరీశ్ రావు (harish rao) మాట్లాడిన కామెంట్స్ విమర్శలకు దారితీసింది. ఆంధ్రాలో ఏమీ లేదని.. ఇక్కడే ఉండాలని.. ఓటు హక్కు ఒక చోట ఉంచుకోవాలని కోరారు. తెలంగాణలో ఉంటూ.. చెమట చిందిస్తే ఇక్కడివారిగానే పరగణిస్తామని హరీశ్ (harish) పేర్కొన్నారు. ఏపీ డెవలప్ మెంట్ కాలేదని కామెంట్స్ చేయగా.. ఏపీ మంత్రులు (ap ministers) వరసగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటు హరీశ్‌కు (harish) మాత్రం మద్దతు కరవైంది. మంత్రులు, నేతలు సపోర్ట్ చేయడం లేదు.