Kodali naniపై నందమూరి రామకృష్ణ నిప్పులు.. రాజకీయ భిక్ష పెట్టిన తమపై ఇలా అంటూ
కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమనే సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. నిమ్మకూరులో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు రామకృష్ణ హాజరయ్యారు.
Nandamuri Rama krishna:టీడీపీ అధినేత చంద్రబాబుపై (chandrababu) ఇటీవల మాజీమంత్రి, వైసీపీ నేత కొడాలి నాని (kodali nani) కామెంట్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్కు (cm jagan) అనుకూలంగా.. జూనియర్ ఎన్టీఆర్ను (ntr) ప్రమోట్ చేస్తూ మాట్లాడతారు. కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ (Nandamuri Rama krishna) మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమనే సంగతి గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ (ntr) స్వగ్రామం నిమ్మకూరులో జరిగిన శతజయంతి వేడుకలకు రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నానిపై (nani) తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీని చంద్రబాబు (chandrababu) మోసం చేస్తున్నారని కొడాలి నాని (kodali nani) పదే పదే అంటున్నారు. దీనిపై రామకృష్ణ (Rama krishna) స్పందిస్తూ.. ఎవరినీ.. ఎవరు మోసం చేశారో ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుందన్నారు. తెలుగుదేశం (tdp) పార్టీని వాడుకొని, నందమూరి ఫ్యామిలీని (ntr family) కొడాలి నాని (kodali nani) మోసం చేశారని కౌంటర్ అటాక్ చేశారు. చంద్రబాబు (chandrababu) తమ కుటుంబంలో సభ్యుడు అని.. తమను మోసం చేయలేదని స్పష్టంచేశారు.
సీఎం జగన్ హయాంలో అభివృద్ది 40 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందని పేర్కొన్నారు. తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడం చంద్రబాబు (chandrababu) వల్లే సాధ్యం అని రామకృష్ణ (Nandamuri Rama krishna) అంటున్నారు. నిమ్మకూరు రావడం తనకు ఆనందంగా ఉందని రామకృష్ణ కూతురు సుహాసిని (suhasini) అన్నారు. ఆడపడుచు వచ్చిందని అంతా గౌరవిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్, బసవతారం విగ్రహాలకు రామకృష్ణ, సుహాసిని, టీడీపీ నేతలు నివాళి అర్పించారు.