పోలింగ్ కేంద్రంలో ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Shivakumar: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రాష్ట్రమంతా నిన్న పోలింగ్ జరిగింది. అయితే పోలింగ్ కేంద్రంలో ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు మరో ఏడుగురు కూడా దాడి చేసినట్లు సుధాకర్ ఫిర్యాదులో తెలిపారు. ఎమ్మెల్యే శివకుమార్ నిన్న ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అందరితో కలిసి క్యూలైన్లో రాకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేశారు.
అప్పటికే రెండు గంటల నుంచి క్యూలైన్లో వేచిఉన్న ఓటర్లు అసహనానికి గురయ్యారు. అయితే గొట్టుముక్కల సుధాకర్ అనే ఓటరు అందరూ క్యూలైన్లో నిలబడి వచ్చి ఓటు వేయాలని తెలిపారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే అతనిని నువ్వెవరివి నాకు చెప్పడానికి అంటూ చెంప దెబ్బ కొట్టారు. దీంతో ఓటరు కూడా వెంటనే ఎమ్మెల్యేను కొట్టాడు. వెంటనే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అనుచరులు సుధాకర్‌పై దాడి చేశారు. కొంతమంది అడ్డకునే ప్రయత్నం చేసిన గొడవ తగ్గలేదు. అతనిపై దాడి చేసినందుకు కంప్లైట్ చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.