అక్టోబరు 8న విజయవాడలో శంఖనాధ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి(Meenakshi Lekhi) హాజరు కాగా..ఏపీలో ఉన్న పలువురు కీలక నేతలతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
Shankhnaad In Andhra People of AP saying thank you Modi Promotion of bjp schemes
ఈరోజు (అక్టోబరు 8న) విజయవాడలో జరిగిన శంఖనాధ్ కార్యక్రమానికి భారతదేశ విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక సహాయ మంత్రి మీనాక్షి లేఖి(Meenakshi Lekhi) హాజరయ్యారు. ఈమె విజయవాడకు చేరుకున్న తర్వాత కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా APకి చెందిన సోషల్ మీడియా వాలంటీర్లు & ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో #ShankhnaadInAndhra పేరుతో సోషల్ మీడియాలో బీజేపీ చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గ్రామీణ కుటుంబాలకు సామాజిక భద్రతను కలిపించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లోని 1930 గ్రామాలకు సంపూర్ణ బీమా గ్రామ యోజన (SBG) ద్వారా భద్రత కల్పించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతోపాటు ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజనతో ఆంధ్రప్రదేశ్లో 1.36 లక్షల హెక్టార్లకు బిందు సేద్యంకు అవకాశం కల్పించారని తెలిపారు. DDU-GKY ద్వారా ఆంధ్రప్రదేశ్లో 1,06,528 మంది యువతకు శిక్షణ, 73,925 మందికి ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. మరోవైపు ఏపీలో గ్రామీణ పేదలకు 2,48,682 ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రకటించారు. దీనికితోడు 2.68 కోట్ల మంది పౌరులకు ఎటువంటి ఖర్చు లేకుండా 28.5 లక్షల మెట్రిక్ టన్నుల పంట తృణధాన్యాలను పంపిణీ చేశారన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని 14,32,329 మాతృమూర్తుల ఖాతాల్లో రూ.647 కోట్లు డిపాజిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.