Anitha: వైఎస్ జగన్ సర్కార్‌పై టీడీపీ మహిళ నేత వంగలపూడి అనిత (Anitha) తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ మహిళా నేతలకు వేధింపులు తప్పడం లేదన్నారు. సోషల్ మీడియ వేదిక పేటీఎం బ్యాచ్ వేధిస్తోందని ఆరోపణలు చేశారు. వారి వెనక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే వైసీపీ పేటీఎం బ్యాచ్ తెలుగు మహిళలను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వేధిస్తోందని అనిత (Anitha) ఆరోపించారు.
తమపై పోస్టులు పెడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అనిత (Anitha) అంటున్నారు. పోలీసులను కోరిన రెస్పాండ్ కావడం లేదని చెప్పారు. ఇదే అంశంపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేద్దామని అపాయింట్మెంట్ కోరిన ఇవ్వడం లేదని అంటున్నారు. వైసీపీ ఎంపీ భార్యను కిడ్నాప్ చేస్తేనే వైసీపీ ప్రభుత్వం స్పందించలేదని అనిత (Anitha) విమర్శలు చేశారు. ఇక సామాన్యుల సంగతి ఏంటీ అని అడిగారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లభించడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వారి ఆగ్రహానికి జగన్ గురవుతారని వార్నింగ్ ఇచ్చారు. సజ్జల, ఆయన కుమారుడు టీడీపీ మహిళా నేతలను వేధిస్తోన్న వారికి అండగా సీఎం జగన్ నిలుస్తున్నారని అనిత ఆరోపించారు.