AP, Speaker, Tammineni Sitaram, Fire, WomanTammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Sitaram) ఓ మహిళపై ప్రతాపం చూపించారు. సమస్య చెప్పిన ఆమెపై అరిచి తన స్థాయిని తగ్గించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం నెల్లిపర్తిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఓ మహిళ స్పీకర్‌కు తన సమస్యలను వివరించింది. నిజానికి ఆమె గురించి తెలిసిన స్పీకర్.. చూడనట్టు వెళ్లిపోయారట. అతని వద్దకు చేరుకుని ఇష్యూ చెప్పింది. తన అత్త పెన్షన్ గురించి వివరించింది. ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులకు స్పీకర్ తమ్మినేని (Tammineni) సూచించారు.
ఆ వెంటనే తన సమస్యను చెప్పింది. అంగన్ వాడీ టీచర్ పోస్ట్ నుంచి తనను తొలగించారని అడిగింది. ఎందుకు తీసివేశారని ఆమె ప్రశ్నించింది. దీంతో తమ్మినేని సీతారాంకు చిర్రెత్తుకు వచ్చింది. ఆ విషయం తనకు తెలును ని చెప్పారు. పోస్ట్ గురించి దిక్కున చోట చెప్పుకోవాలని కోపంతో ఊగిపోయారు. ఏం తమాషాగా ఉందా అంటూ చిందులేశారు. సమస్య పరిష్కరిస్తానని చెబితే.. తననే నిలదీస్తావా..? ఏం తమాషాగా ఉందా అని ఫైరయ్యారు.
స్పీకర్ (speaker) వైఖరి చూసి అక్కడున్న స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ సమస్య గురించి చెబితే ఇలా స్పందించారంటే అని వారు చర్చించుకున్నారు. ప్రాబ్లమ్ ఉండటం వల్లే కదా.. చెప్పుకున్నాం అని.. ఇలా బిహెవ్ చేయడం భావ్యం కాదని అంటున్నారు. ఇప్పుడే కాదు గతంలో కూడా స్పీకర్ తమ్మినేని (Tammineni) దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయని శ్రీకాకుళం జిల్లా వాసులు అంటున్నారు.