»Pulivendula Reporter Interesting Conments On Ys Viveka Murder Case And Cbi
YS viveka murder: ఎవరి కోసమో ఇలా చేయొద్దు, వట్టి ప్రచారం..
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) పైన
పులివెందులకు చెందిన భరత్ కుమార్ అనే విలేకరి (reporter) మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Vivekananda Reddy murder case) పైన పులివెందులకు చెందిన భరత్ కుమార్ అనే విలేకరి (reporter) మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో A2 ఉన్న సునీల్ యాదవ్, 2019 మార్చి 14 వ తేదీ రాత్రి సమయంలో వైయస్ భాస్కర్ రెడ్డి (ys Bhaskar Reddy) ఇంట్లో సునీల్ ఉన్నాడని కొన్ని పత్రికలు అవాస్తవాలను ప్రచారం చేయడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించింది అన్నాడు. కానీ ఆ రోజు సునీల్ యాదవ్ తనతో ఉన్నాడని చెప్పాడు. సునీల్, తను ఇద్దరం సాయంత్రం ఆరున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు నందిక హాస్పిటల్ వద్ద ఇద్దరం కలిసే ఉన్నట్లు చెప్పాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సిబిఐకి ఇచ్చినట్లు చెప్పాడు వీడియో ఫుటేజ్ కూడా ఉన్నదని, దానిని కూడా సిబిఐ నిర్ధారించింది అన్నాడు. కానీ కొన్ని పత్రికలు, అధికారులు మాత్రం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశాడు. ఎందుకు ఇంత అవాస్తవాలు చెబుతున్నారని ప్రశ్నించాడు. అధికారులు చెప్పనప్పటికీ కొన్ని పత్రికలు అవస్థలు రాస్తున్నాయి కావచ్చు… అది మాత్రం తనకు నాకు తెలియదు అన్నాడు. ఈ కేసులో మొదట సిబిఐ వారు తనను కూడా అనుమానించిజ్ ప్రశ్నించినట్లు చెప్పాడు. ఫోన్ కాల్ డేటా ఆధారంగా వారు తనను పిలిపించడంతో.. వెళ్లి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పినట్లు వెల్లడించాడు.
తనకు ఒక చిన్న స్థలం పంచాయతీ విషయమై వైయస్ వివేకతో సెటిల్ చేయాలని సునీల్ యాదవ్ ను కోరినప్పడి నుండి అతను మరింత దగ్గర అయినట్లు చెప్పాడు. విచారణలో తాను చెప్పిన సమాధానాలను సిబిఐ అన్ని కోణాల్లో విచారించుకొని నిర్ధారించుకున్నట్లు చెప్పాడు. కానీ కొన్ని ఇప్పుడు కొన్ని పత్రికల్లో సునీల్ యాదవ్ ఆ రోజు రాత్రి వైయస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని వార్తలు రావడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు.
వాస్తవాలను మరచి అధికారులు కూడా ఎవరి కోసం, ఎందుకోసం, ఏదో ఒక అవాస్తవాన్ని చెబుతున్నారని ప్రశ్నించాడు. తప్పు చేసిన వారిని వదిలేస్తే మీకేం వస్తుందని అవేదన వ్యక్తం చేశాడు. నిజాన్ని దాచి ఓకే కోణంలో ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించాడు. తప్పు కనిపిస్తున్నా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు. తాను సిబిఐ వారికి ఇచ్చిన సమాధానాలతోనే కేసు ముందుకు సాగిందన్నాడు. తాను ఎవరికీ అమ్ముడు పోలేదన్నాడు. సీబీఐ పైన గౌరవం ఉందని, దానిని నిలబెట్టుకోవాలన్నారు. ఎవరి కోసమో తప్పు చేయవద్దని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పాడు.