టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ (BVSN PRASAD) జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన (JANASENA) కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ కు జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పవన్ బ్లాక్ బస్టర్ హిట్ అత్తారింటికి దారేది చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాదే నిర్మాత. గతంలో ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించని బీవీఎస్ఎన్ ప్రసాద్ ఉన్నట్టుండి జనసేన తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుతో ‘డ్రైవర్ బాబు’ సినిమాని తెరకెక్కించి నిర్మాతగా కెరీర్ ని స్టార్ట్ చేశారు ప్రసాద్. ఆ తరువాత ప్రభాస్ తో (Prabhas) ఛత్రపతి, రామ్ చరణ్ తో (Ram Charan) మగధీర, పవన్ కళ్యాణ్ తో (Pawan Kalyan) అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మిస్తూ వచ్చారు. ఇది ఇలా ఉంటే.. ఈ నిర్మాత రాజకీయ రంగంలో కూడా కొన్నాళ్ళు ప్రయాణం చేశారు.మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం అందరికి తెలిసిందే. ఆ పార్టీ తరుపున పోటీ చేయకపోయినప్పటికీ.. కార్యకర్తగా ఎన్నో సేవలు అందించారు.
చిరంజీవి (Chiranjeevi)వెంట పార్టీ ఉన్నంత కాలం నడుస్తూ వచ్చారు. ఇక ప్రజారాజ్యం (Prajarajyam) విలీనం అనంతరం పూర్తిగా మళ్ళీ సినిమా రంగంలోనే బిజీ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్ళీ రాజకీయం వైపు చూపు తిప్పారు. అయితే ప్రసాద్ ఈసారి కూడా పార్టీ కార్యకర్తగానే ఉంటారా? లేదా ఎన్నికల్లో పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ప్రసాద్ ఇటీవలే ‘విరూపాక్ష(Virupaksha)’ సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ ని అందుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ తో (Varun Tej) గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) సినిమాని తెరకెక్కిస్తున్నారు.