ఢిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాగుంట రాఘవ (Magunta Raghava) ఢిల్లీలోని తిహార్ జైలు వద్ద ఈడీ అధికారుల(ED officials)ముందు లొంగిపోయాడు. తన అమ్మమ్మకు ఆరోగ్యం సరిగా లేనందున తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వవలసిందిగా రాఘవకు తొలుత ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు.. దీంతో ఆయనకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే, ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పరిమితి కుదించి లొంగిపోవాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మాగుంట రాఘవ ఈడీ అధికారులకు లొంగిపోయాడు. ప్రస్తుతం రాఘవ జ్యుడిషియల్ రిమాండ్(Judicial remand) లో కొనసాగుతున్నారు. జూన్ 12న సరెండర్ కావాలని రాఘవను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నిందితుడు జైల్లో లొంగిపోయాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఫిబ్రవరి 10న రాఘవను ఈడీ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్(South Group)లో కీలక పాత్రధారిగా రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.ఈ కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి (Sarath Chandra Reddy) అప్రూవర్‌గా మారుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.