»Record Number 800000 Of Weddings In China Decreased In 2022 Is That The Reason
China:లో రికార్డు స్థాయిలో తగ్గిన పెళ్లిళ్లు..కారణం అదేనా?
చైనా(china) దేశంలో కొత్తగా మరో సంక్షోభం తలెత్తినట్లు తెలుస్తోంది. అదే పెళ్లిళ్ల అంశం కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనేక మంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకాడుతున్నట్లు తెలిసింది. 2022లో వచ్చిన నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
చైనా(china)లో 2022లో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు(weddings) తగ్గిపోయాయి. చైనా చరిత్రలోనే అత్యల్పానికి తగ్గాయని(decreased) అక్కడి వార్తా సంస్థ Yicai (జూన్ 12న) ఆదివారం తెలిపింది. గత దశాబ్దం నుంచి స్థిరమైన క్షీణత కొనసాగుతున్నట్లు రిపోర్ట్ పేర్కొంది. అయినప్పటికీ కఠినమైన COVID లాక్డౌన్ల వల్ల వివాహ వ్యవస్థపై ప్రభావం పడిందని పలువురు అంటున్నారు. గత సంవత్సరం కేవలం 6.83 మిలియన్ల జంటలు మాత్రమే తమ వివాహ రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారని పేర్కొన్నారు. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 800,000 తగ్గినట్లు వెల్లడించారు.
గత సంవత్సరం పది లక్షల మంది వారి ఇళ్లలో లేదా పలు చోట్ల కరోనా(corona) ఆంక్షల కారణంగా తగ్గిపోయారని రిపోర్ట్ తెలిపింది. ఈ నేపథ్యంలో వివాహ వ్యవస్థ జననాల రేటుపై కూడా ప్రభావం చూపుతుందని అక్కడి అధికారులు అంటున్నారు. చైనా జనాభా గత ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా పడిపోయింది. ఇది దాని ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రపంచానికి పౌరుల సంఖ్యలో దీర్ఘకాల క్షీణతకు దారితీస్తుంది. చైనా జననాల రేటు గత సంవత్సరం 1,000 మందికి 6.77 జననాలకు పడిపోగా.. ఇది 2021లో 7.52గా ఉండేది.