Pawan Kalyan : ఆ రెండు క్యాస్ట్ లు కలిస్తే రాజ్యాధికారం మనదే పవన్ సంచలన కామెంట్స్
మంగళగిరిలో (Mangalagiri) జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని పవన్ అన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇద్దరు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమన్నారు.నేను కాపు నాయకుడిని కాదు. నేను క్యాస్ట్ ఫీలింగ్ తో పెరగలేదు. మానవత్వంతో పెరిగాను. కాపు రిజర్వేషన్లపై (Kapu reservations) కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని ఆయన చెప్పారు.
మంగళగిరిలో (Mangalagiri) జనసేన పార్టీ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సంచలన కామెంట్స్ చేశారు. కాపు-బీసీ కాంబినేషన్ ఉండాలని పవన్ అన్నారు. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇద్దరు కలిస్తే రాజ్యాధికారం సాధ్యమన్నారు.నేను కాపు నాయకుడిని కాదు. నేను క్యాస్ట్ ఫీలింగ్ తో పెరగలేదు. మానవత్వంతో పెరిగాను. కాపు రిజర్వేషన్లపై (Kapu reservations) కొందరు బీసీ నేతలు తమ అభిప్రాయాన్ని ఆయన చెప్పారు. రేపు కాపు ప్రతినిధులతో జరిపే సమావేశంలో చర్చిస్తాను. కాపు-బీసీ కలిస్తే రాజ్యాధికారం సాధ్యం. ఈ కాంబినేషన్ ఉంటే ఎవరినీ దేహీ అని అడగాల్సిన అవసరం లేదు. రోజుకు అర్ధ రూపాయి తీసుకుని ఓటు అమ్ముకునే దుస్థితి పోతే. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. బీసీలకు సంబంధించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని అన్నారు. బీసీలు ముందుగా సాధించాల్సింది ఐక్యతని పూలేను గౌరవించింది మనమే.
బీసీ సదస్సు అంటే ఇంతమంది వచ్చారు. కానీ బీసీ నేతను నిలబెడితే ఎందుకు ఓట్లేయరు..? గత ఎన్నికల్లో విజయవాడ (Vijayawada) వెస్ట్ సీపీఐ అడిగినా బీసీ నేత అయిన పోతిన మహేష్ కోసం వారికి ఇవ్వలేదు. నేను బీసీల కోసం నిలబడతాను” అని పవన్ కల్యాణ్ చెప్పారు” బీసీ యువత.. భవిష్యత్ కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించాలి. నేను అన్ని కులాలను సమానంగా గౌరవిస్తా. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరి చేసే ప్రయత్నం చేశాను. కోనసీమలో కాపులు, శెట్టిబలిజ కులాలను కలిపే ప్రయత్నం చేశాను. బలమైన కులాలు ఎందుకు కొట్టుకోవాలి. కోనసీమలో ఇప్పుడు బలమైన మార్పు చూస్తున్నాం. గోదావరి జిల్లాల్లో నాకు ఎక్కువగా బీసీ ఓట్లే పడ్డాయి. మత్స్యకారులు చాలామంది ఓట్లేశారు. నన్ను కాపు ప్రతినిధిగా చూడనవసరం లేదు. ఆర్థిక పరిపుష్టి వస్తే.. రాజ్యాధికారం (State power)కచ్చితంగా వస్తుంది. వైసీపీ, టీడీపీలకు ఆర్థిక పరిపుష్టే బలం” అని పవన్ కల్యాణ్ అన్నారు