»Alert To Tirumala Devotees Break Darshans Are Cancelled
TTD Information: తిరుమల భక్తులకు అలర్ట్.. బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నారు. మార్చి 22వ తేదిన తిరుమలలో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ నిర్వహించనుంది. ఈ తరుణంలో మార్చి 21, 22వ తేదీల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు రోజుల్లో ఎలాంటి సిఫారసు ఉత్తరాలను స్వీకరించబోమని టీటీడీ వెల్లడించింది.
తిరుమల శ్రీవారి ఆలయం(TTD)లో ఉగాది సందర్భంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నారు. మార్చి 22వ తేదిన తిరుమల(Tirumala)లో ఉగాది ఆస్థానాన్ని టీటీడీ(TTD) నిర్వహించనుంది. ఈ తరుణంలో మార్చి 21, 22వ తేదీల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ రెండు రోజుల్లో ఎలాంటి సిఫారసు ఉత్తరాలను స్వీకరించబోమని టీటీడీ(TTD) వెల్లడించింది.
మార్చి 22వ తేదిన శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను టీటీడీ(TTD) నిర్వహించనుంది. ఇందుకోసం ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఉగాది(Ugadi) పర్వదినం రోజు సుప్రభాత సేవ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఆ తర్వాత ఉదయం ఆరు గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలంకరణ చేస్తారు.
ఉగాది(Ugadi) పండగ రోజున తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ కార్యక్రమాల్ని టీటీడీ(TTD) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 21, 22వ తేదీల్లో వీఐపీ(VIP) బ్రేక్ దర్శనాల్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు ముందుగానే గుర్తించి, సహకరించాలని టీటీడీ(TTD) భక్తులను కోరింది.