రేపు పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు అరెస్టైన సమయంలోనే ఆయనను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ ఏపీ పోలీసు(AP Police)లు అందుకు అనుమతించలేదు. ఓసారి బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు. మరోసారి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు జనసేనానిని అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రకారాగారంలో ములాఖత్‌కు అనుమతి లభించింది. మరోవైపు, బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra) నేటి సాయంత్రం నాలుగు గంటలకు జైల్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు.
నారా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయన్ని ఏ14గా చేర్చుతూ సీఐడీ అధికారులు స్వయంగా నోటీసులివ్వడం చర్చనీయాంశమైంది. అక్టోబర్ 4వ తేదిన ఆయన విచారణకు హాజరుకావాలని సీఐడీ కోరింది.