WNP: మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులను సద్వినియోగం చేసుకోవాలని రంగాపురం ఉపసర్పంచ్ నందీశ్వర్ తెలిపారు. పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామంలో నట్టల నివారణ మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నందీశ్వర్ మాట్లాడుతూ.. పశువుల్లో నట్టల వల్ల శారీరక బలహీనతతో పాటు ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉండాలంటే నట్టల మందు వేయాలన్నారు.