VZM: పైడితల్లమ్మ అమ్మవారి ఉత్సవాలు సందర్బంగా పోలీస్ శాఖ ఏర్పాటుచేస్తున్న బందోబస్తు, భద్రత ఏర్పాట్లను విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి ఎస్పీ ఏ.ఆర్.దామోదర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ.. అమ్మవారి పండగ ఉత్సవాలకు, అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.
GNTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSMDA తెలిపింది. దీని ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ఉదయానికి ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
GNTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని APSMDA తెలిపింది. దీని ప్రభావంతో పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం ఉదయానికి ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
KDP: పోలీసులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులే దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాళ్లు పోలీసులకే సహకారం అందిస్తున్నారని విమర్శించారు. పోలీసుల మీద పోలీసులే విచారిస్తే న్యాయం జరగదన్నారు.
కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గురువారం ప్రభుత్వ విప్ బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలో ఆమెకు కేటాయించిన కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ఎంతో నమ్మకంతో తనకు ఈ పదవి అప్పగించిందని, ఈ పదవికి న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. ఆమెను పలువురు సహచర ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ELR: జిల్లా ఉపాధి కార్యాలయం, Setwel సంయుక్తంగా ఈనెల 27న ఉదయం 10 గంటలకు కలెక్టర్ కాంపౌండ్ లోని Setwel కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. హ్యాపీ మొబైల్స్‌లో పనిచేసేందుకు 18-45 ఏళ్ల వయస్సు ఉన్నవారు పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారు అర్హులు. వేరియంట్ స్కూల్‌కు బీఈడీ అర్హతతో 20-40 ఏళ్ల వయస్సు ఉన్నవారు హాజరు కావచ్చని జిల్లా ఉపాధి అధికారిణి వరలక్ష్మి తెలిపారు.
KRNL: నిజాయితీకి ప్రతీకగా ఆటో డ్రైవర్ రవికుమార్ నాయక్ నిలిచారు. గురువారం కర్నూలులోని మౌర్య ఇన్ దగ్గర ఆటో ఎక్కిన ప్యాసింజర్ తన ఐఫోన్ మర్చిపోయి వెళ్లిపోయారు. డ్రైవర్ నిజాయితీతో రూ. 80,000 విలువైన ఐ ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. నిజాయితీకి మెచ్చిన నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ శాలువా కప్పి రవికుమార్ నాయక్‌ను సన్మానించారు.
W.G: నరసాపురం పురపాలక మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఈనెల 27న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సెల్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఛైర్‌పర్సస్ బర్రె శ్రీవెంకటరమణ తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి సకాలంలో కౌన్సిల్ సభ్యులు హాజరు కావాలని కోరారు.
VSP: గాజువాక సమీపంలోని పెదగంట్యాడలో మరమ్మతుల కారణంగా 11కేవీ వుడా ఫీడర్ పరిధిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ జోన్-2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీకే నాయుడు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వుడా ఫీడర్ పరిధిలోని టీఎన్‌ఆర్ రోడ్డు సిద్దేశ్వరం, వెంపళ్లనగర్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
AKP: కోటవురట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సర్వసభ్య సమావేశం ఈనెల 27వ తేదీన నిర్వహించనున్నట్లు ఛైర్మన్ వేచలపు జనార్ధన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొంటున్నట్లు తెలిపారు. పంట రుణాలు, సొసైటీ అభివృద్ధి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు ఏర్పాటు చేసిన ఎంజీఆర్ ఉచిత మెగా డీఎస్సీ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన 80 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విజయవాడలో గురువారం అభినందించారు. విజేతలు కూటమి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
కోనసీమ: రామచంద్రపురం కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో విడత ప్రవేశాలు ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్.రామ కృష్ణ చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు చేరవచ్చని సూచించారు.
BPT: కన్నతల్లిని కుమారుడు హత్య చేసిన ఘటన బాపట్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాపట్ల మండలం పూండ్ల గ్రామంలో పంచాయతీ గ్రీన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న రమణమ్మను తన కొడుకు జాలయ్య మద్యం మత్తులో గడ్డపారతో హత్య చేశాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బాపట్ల మండలం వెదుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఉమామహేశ్వర్ తనిఖీ చేశారు. గురువారం పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.
CTR: వేపంజేరి లక్ష్మీనారాయణస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27నుంచి వచ్చే నెల 2 వరకు నిర్వహించనున్నట్లు ధర్మకర్త వాసు, మేనేజరు వెంకటేశ్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి అగ్నిహోమం, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, అన్నదానం, పలురకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.