VSP: “నీతి ఆయోగ్” ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) బివీఆర్ సుబ్రహ్మణ్యం ఆదివారం ఉదయం విశాఖపట్నం రానున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొని, 23న ఉదయం తిరుగు పయనమవుతారన్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు గమనించాలని సూచించారు.
PPM: వైసీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా సాలూరుకు చెందిన యువ న్యాయవాది గొర్లె కిరణ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ సందర్భంగా పార్టీకి అన్నివిధాలా న్యాయ సలహాలు, సూచనలు అందిస్తానని కిరణ్ కుమార్ తెలిపారు. ఈ నియామకంపై మాజీ Day CM పీడిక రాజన్న దొర హర్షం వ్యక్తం చేశారు.
TPT: శ్రీసిటీ పరిధిలోని LG పరిశ్రమ వద్ద కాపర్ వైర్ల దొంగతనానికి పాల్పడ్డ నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రోజూవారి కూలీ పనులకు వచ్చిన వీరు కాపర్ వైర్లను దొంగిలించినట్లు తెలిపారు. LG పరిశ్రమ HR ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీసిటీ పోలీసులు వీరిపై నిఘా ఉంచి పట్టుకున్నారు. రూ.2.30 లక్షల విలువైన రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ASR: అరకు ప్రధమ శ్రేణి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో మార్చి 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి రాము తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీపడే అవకాశం ఉన్న కేసులు, లోక్ అదాలత్‌లో పరిష్కారం కోసం లాయర్లు, పోలీసు అధికారులు అవగాహన కల్పించాలన్నారు
AKP: మండల కేంద్రమైన పరవాడలో ఆదివారం పైడిమాంబ అమ్మవారి పండగను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే తానాం గ్రామంలో పరదేశిమాంబ అమ్మవారి పండగను ఘనంగా నిర్వహించనున్నారు. రెండు గ్రామాల్లోనూ మూడు రోజులు పాటు పండగలు జరుగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పండగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
TPT: దేవస్థానం ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణశాలలో పనిచేస్తున్న అగర్బత్తులు తయారీ కేంద్రాన్ని జీఈఈవో డాక్టర్ ఎ.శరత్ పరిశీలించారు. ప్రస్తుతం చామంతి, గులాబీ, తామర సుగంధాలతో మూడు రకాల అగర్బత్తులు తయారవుతున్నాయని, త్వరలో సంపంగి, వెయ్యి వరహాలు, తులసి సుగంధాలతో మరో మూడు రకాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
GNTR: గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల వ్యక్తిని ఒక గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
VZM: పట్టణంలో స్దానిక కోట వద్ద ఆదివారం ఉదయం 6.30 నుండి 8.30 వరకు హ్యాపీ సండే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మునిసిపల్ సహాయ కమీషనర్ కిల్లాన అప్పలరాజు శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవితంతో సతమతమవుతున్న ప్రజానీకానికి మానసిక ఉల్లాసం కలిగించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు.
సత్యసాయి: కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ATP: మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తుంగభద్రా నదీతీరంలో వెలసిన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు.
W.G: ప్రజా సమస్యల పరిష్కారానికై సీపీఎం ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బలరాం పిలుపునిచ్చారు. శనివారం ఆకివీడులోని సీపీఎం ఏరియా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా స్థాయిలో పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
SKLM: గ్రామాల పరిశుభ్రతలో, మౌలిక సదుపాయాల నిర్వహణలో అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే నిజమైన హీరోలని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. శనివారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు .
AKP: మునగపాక మండలం నాగులపల్లి పీఏసీఎస్ సభ్యుడు రంగాల గురువు నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆ కుటుంబానికి రూ. రెండు లక్షల బీమా చెక్కును ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఎలమంచిలి క్యాంపు కార్యాలయంలో శనివారం అందజేశారు. పీఏసీఎస్ ఛైర్మన్ వై. వెంకట భాస్కరరావు మాట్లాడుతూ.. సభ్యులందరకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించామన్నారు. సీఈవో మల్ల స్వామి పాల్గొన్నారు.
W.G: సోషల్ మీడియాతోపాటు మీడియా ఛానెళ్లలో మతపరమైన చర్చలను నిషేధించాలని జాతీయ పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం తెలంగాణ గవర్నర్ జిషుదేవ్ వర్మను తణుకుకు చెందిన ఫెలోషిప్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ రెవరెండ్ మాథ్యూ మీగర్, చీఫ్ కోఆర్డినేటర్ రెవరెండ్ ఓ. మనోజ్ బాబ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బిషన్ అనుపమ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.
కృష్ణా: ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు మరో అవకాశాన్ని అందిస్తోంది. ఈ నెల 23 నుంచి PGDCA కోర్సులో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని కేంద్రం అడ్మినిస్ట్రేటివ్ ఇన్‌ఛార్జ్ జి. అంకమ్మరావు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ 9100033552, 8074932997 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.