CTR: అరగొండలోని పురాతన చరిత్ర కలిగిన శివాలయంలో ఆదివారం ఉదయం కుంభాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అపోలో అధినేత ప్రతాప్ సి రెడ్డి సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే కలికిరి మురళీ మోహన్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
KRNL: ఆదోని మున్సిపల్ కమిషనర్ నయీం మహమ్మద్ ఆధ్వర్యంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం భాగంగా పబ్లిక్ హెల్త్ వర్కర్లకు ఆదివారం క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులు పనులను ఒత్తిడిగా కాకుండా ఉత్సాహంతో నిర్వహించాలన్నారు.
ASR: విశాఖ ఉమ్మడి జెడ్పీ సమావేశంలో అనంతగిరి జెడ్పీటీసీ దీసరి గంగరాజు అధికారుల తీరుపై మండిపడ్డారు. సరైన వైద్యం అందక గిరిజనులు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనుల బిల్లుల్లో కమీషన్లు, ఐకేపీ నిధుల దుర్వినియోగాన్ని సభలో నిలదీశారు. ఆశ్రమ పాఠశాలల్లో గంజాయి మాఫియాను అరికట్టాలని, విధులకు గైర్హాజరయ్యే టీచర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
KRNL: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా పలువురు ప్రముఖులకు పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ‘రాఘవేంద్ర స్వామి ప్రశస్తి’ అవార్డులను ప్రదానం చేశారు. పురస్కార గ్రహీతలలో రామకృష్ణ , అశ్వత్ నారాయణతోపాటు ప్రముఖ ఎమ్మిగనూరుకు చెందిన శక్తి నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ గౌడప్ప గౌడ, బళ్లారికి చెందిన డాక్టర్ సుధీర్ ఉన్నారు.
VZM: భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శిగా పల్లి రాంబాబు నియమితులయ్యారు. విజయనగరం మండలం బడుకుండుపేట గ్రామానికి చెందిన రాంబాబు ఆ పార్టీ అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ చేతుల మీదుగా పదవి బాధ్యతలకు సంబంధించిన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈసందర్బంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు.
సత్యసాయి: కొత్తచెరువులో శ్రీ లక్ష్మి సౌభాగ్య మహిళా కోఆపరేటివ్ బ్యాంకును ఆర్డీటీ ఉమెన్ ఎంపవర్‌మెంట్ డైరెక్టర్ విశాలా ఫెర్రర్ ప్రారంభించారు. కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల నుంచి సుమారు 800 మంది మహిళా సంఘ సభ్యులు హాజరయ్యారు. మహిళలే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా, యజమానులుగా ఉంటూ ఈ బ్యాంకును నిర్వహించనున్నారు.
VSP: సింహాచలం సింహాద్రి అప్పన్నను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. వారికి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధ స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి దర్శనం కల్పించారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
కృష్ణా: మానవత్వంతో పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. పెదపారుపూడి మండలం చినపారుపూడి గ్రామంలో శ్యామల రాజు కుటుంబానికి మంజూరైన రూ. 1,64,543 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును వారి గృహానికి వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల పాలిట కల్పవల్లి శ్రీ కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ధర్మాదాయ హుండీ లెక్కింపు ఫిబ్రవరి 27 న ఆలయం ప్రాంగణంలో జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాకచర్ల రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోంపేట దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆలయం పాలకమండలి ఆలయం భక్తులు పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో లెక్కింపు జరుగుతుందన్నారు.
నెల్లూరు నగరపాలక సంస్థకు అద్దె, రెన్యువల్ బకాయిలు చెల్లించని కారణంగా కమిషనర్ వై.ఓ నందన్ ఆదేశాల మేరకు శనివారం అధికారులు 3 దుకాణాలను సీజ్ చేశారు. ప్రకాశం పంతులు కాంప్లెక్స్‌లో షాప్ నం. 8 (రూ. 24.55 లక్షలు), ఏ.సి. బొమ్మ కాంప్లెక్స్‌లో షాప్ నం. 9, 10 బకాయిలు ఉండటంతో రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు తీసుకున్నారు.
కృష్ణా: కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం గ్రామం రాళ్ళరేవు హైస్కూల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రధానంగా మధుమేహం, గుండె ఎముకలు, ఊపిరితిత్తులు, దంత, స్త్రీల ప్రసూతి, జనరల్ సర్జరీ, జనరల్ వ్యాధులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.
ATP: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హ్యాపీ సండే కార్యక్రమం గుంతకల్లు రైల్వే క్రీడా మైదానంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి హాజరయ్యారు. అనంతరం ఆమె కాసేపు క్రికెట, బ్యాట్మెంటన్ ఆటలను ఆడారు. కమిషనర్ మాట్లాడుతూ.. జీవితంలోని పని ఒత్తిడిని పక్కనపెట్టి ‘హ్యాపీ సండే’ను ఒక ఆనందం వేదికగా మార్చుకుందామని ప్రజలకు సూచించారు.
AKP: అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ శనివారం మృతి చెందినట్లు మునగపాక ఎస్సై ప్రసాదరావు తెలిపారు. మండలంలో గణపర్తి గ్రామ సమీపంలో ఈనెల 19వ తేదీన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మహిళ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. స్థానికులు వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో చేర్పించినట్లు వెళ్లడించారు.
కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెం రైల్వే గేట్ వద్ద హెల్మెట్ ధరించడంపై ఎస్సై చంటిబాబు వాహనదారులకు ఇవాళ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు వాహనంపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రజల భద్రత పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు.
KDP: రాజంపేటలోని మారుతి ప్రసన్న లాడ్జి వద్ద ఉన్న కెనరా బ్యాంకు ఏటిఎం వద్ద విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ఉదయగిరి రాజాపై మద్యం మత్తులో వచ్చిన యువకులు దాడికి పాల్పడ్డారు. బ్యాంకులోకి వెళ్తున్న వారిని ప్రశ్నించడంతో చైర్‌తో తలపై దాడి చేయగా రాజాకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సెక్యూరిటీ గార్డును రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.