• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

చిక్కాలవలసలో విషాద ఛాయలు

SKLM: నరసన్నపేట(M) చిక్కాలవలస కి చెందిన అమృత్ కుమార్ CRPF జవాన్ మణిపూర్ లో విధి నిర్వహణలో గుండెపోటుతో మరణం చెందారు. ఆయన పార్థివదేహాన్ని అధికారులు ఆదివారం స్వగ్రామానికి తీసుకువచ్చారు. జడ్పిటిసి కృష్ణ చైతన్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జవాన్ అంతిమయాత్రలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయ.

February 22, 2026 / 10:03 AM IST

వేమగిరిలో మొదలైన ఆధ్యాత్మిక వైభవం

E.G: కడియం మండలం వేమగిరిలో ఆధ్యాత్మిక వైభవం మొదలైంది. కెవిఆర్ లేఔట్‌లో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పూలరథంపై భక్తులు ఊరేగించారు. వందలాదిమంది మహిళా భక్తులు సంప్రదాయ పసుపు చీరలు ధరించి చేత కాషాయ జెండాలు పట్టి నమో వెంకటేశా అంటూ ముందుకు సాగారు. ఈనెల 26వ తేదీన ఆలయ ప్రతిష్ట జరగనుంది.

February 22, 2026 / 10:01 AM IST

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

GNTR: రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుంటుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని 25 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదివారం రూ. 13,15,872/- చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులు చెక్కులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

February 22, 2026 / 10:00 AM IST

ప్రారంభమైన ఉరవకొండ గవిమఠం బ్రహ్మోత్సవాలు

ATP: ఉరవకొండ గవిమఠం శ్రీచంద్రమౌళీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. మఠం ప్రాంగణంలో అర్చకుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా గంగపూజ, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కరిబసవేశ్వర స్వామి జీవసమాధి వద్ద నాగపూజ జరిపారు. నేడు స్వామివారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

February 22, 2026 / 10:00 AM IST

‘రాష్ట్ర వనరులన్నీ వైసీపీ నేతలు దోచుకున్నారు’

KKD: గత YCP ప్రభుత్వం రాష్ట్రంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఇలా అన్ని వనరులను దోచుకుందని కాకినాడ MLA వనమాడి కొండబాబు ఆరోపించారు. శనివారం TDP కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. చివరికి తిరుమల లడ్డూను కూడా వదలలేదని విమర్శించారు. కల్తీ జరిగిన విషయాన్ని మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అంగీకరించారని తెలిపారు.

February 22, 2026 / 10:00 AM IST

రైలులో వస్తూ మహిళ మిస్సింగ్

NDL: ధర్మవరం-మచిలీపట్నం రైలులో కడప జిల్లా ఎర్రగుంట్లకు వస్తూ వివాహిత అదృశ్యమైనట్లు ఎర్రగుంట్ల రైల్వే పోలీసులు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. తన భార్య శ్రీదేవి వైజాగ్‌లోని అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదృశ్యమైనట్లు నంద్యాలకు చెందిన భర్త జగదీశ్వర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.

February 22, 2026 / 09:55 AM IST

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించిన దీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు.

February 22, 2026 / 09:51 AM IST

ఘనంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి వేడుకలు

KDP: సిద్ధవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP 11వ పోలీసు బెటాలియన్‌లో ఆదివారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ రాజశేఖర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసి ప్రాణాలర్పించిన దీశాలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు.

February 22, 2026 / 09:51 AM IST

జిల్లా రిజిస్ట్రార్‌గా సీహెచ్ నరసింహమూర్తి

అల్లూరి జిల్లా రిజిస్ట్రార్‌గా సీహెచ్ నరసింహమూర్తి నూతనంగా బాధ్యతలను చేపట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న నరసింహమూర్తికి ప్రభుత్వం రిజిస్ట్రార్‌గా పదోన్నతి కల్పించి అల్లూరి జిల్లాకు నియమించింది. నూతనంగా బాధ్యతలను స్వీకరించిన ఆయనకు శనివారం ఉద్యోగులు, కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 09:47 AM IST

నూజివీడులో రేపు మీకోసం కార్యక్రమం

ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి సమస్య ఆన్ లైన్ చేసి నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుందన్నారు.

February 22, 2026 / 09:44 AM IST

శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి 18 గంటలు

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. దర్శనం కోసం కృష్ణతేజ అతిథి భవనం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 82,043 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే 32,299 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లుగా నమోదైంది.

February 22, 2026 / 09:40 AM IST

సింగరాయకొండ వద్ద ఘోర ప్రమాదం

ప్రకాశం: సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కందుకూరు ఫ్లైఓవర్ మీద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న కంటైనర్ బాక్స్ లారీని పుచ్చకాయ లోడ్‌తో వెళ్తున్న మినీ వ్యాన్ వెనుక వైపు నుంచి ఢీకొంది. దీంతో మినీ లారీ డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 22, 2026 / 09:40 AM IST

నగరంలో పెళ్లింట విషాదం.. యువతి మృతి

VZM: అనకాపల్లి జిల్లా బత్తివానిపాలెం వద్ద పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా రాచకిండాం గ్రామానికి చెందిన లావణ్య మృతి చెందింది. సోదరుడి పెళ్లి వేడుక అనంతరం నూతన వధూవరులతో నిన్న శ్రీకాకుళం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లావణ్య మృతి చెందగా నవ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.

February 22, 2026 / 09:37 AM IST

ఈనెల 27న బహిరంగ వేలం పాట

ATP: తాడిపత్రి మండలం గంగాదేవి పల్లెలో కొలువైన గంగాభవాని దేవస్థానంలో ఈనెల 27న మధ్యాహ్నం ఒంటి గంటకు తల నీలాల సేకరణ, వసతి గదులు, సప్లయర్స్ సామాన్ల అద్దె, హోటల్ నిర్వహణ, గాజులు, బొమ్మలు, ఐస్క్రీమ్, చెరుకు రసం విక్రయిం చుకొనుటకు వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఈవో రామాంజినేయులు తెలిపారు. రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొనాలన్నారు.

February 22, 2026 / 09:36 AM IST

అనంత బాబు కేసులో ఉన్నతాధికారి సస్పెండ్

W.G: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన MLC అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పట్లో డీఎస్పీ, ప్రస్తుతం జిల్లా ఏఎస్పీగా ఉన్న భీమరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

February 22, 2026 / 09:34 AM IST