• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భవిత సెంటర్ అకస్మిక తనిఖీ

E.G: గోకవరం మండల కేంద్రంలో సర్వ శిక్షణ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భవిత సెంటర్‌ని జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కనక బాబు శుక్రవారం అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భవిత సెంటర్లో ( మానసిక విద్యార్థుల ) యాక్టివిటీస్‌ని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అలాగే ఫిజియోథెరపీ సేవలను విద్యార్థులకు ఎలా అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

మద్దిపి గ్రామంలో కాలుష్య నీరు సమస్య

సత్యసాయి: లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మద్దిపి గ్రామంలో చెరువు బోరులోని నీరు గత వారం నుంచి కలుషితమై మట్టి నీరు వస్తోంది. కనీసం కడుక్కోవడానికి కూడా వీలులేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేసిన కొత్త బోరును ప్రారంభించి ట్యాంక్‌కు నీరు అందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

కేసులకు భయపడను.. ఎక్కడా తగ్గను: అంబటి

GNTR: జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒకరికి ఒక రోజు వస్తుంది తనకు కూడా రోజు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎదిగిన తాను ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తానని తెలిపారు.

February 20, 2026 / 02:25 PM IST

‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

KRNL: దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో సీఐ వేణుగోపాల్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని, బంగారు ఆభరణాలు బహిరంగంగా ప్రదర్శించరాదని CI వెల్లడించారు.

February 20, 2026 / 02:25 PM IST

‘పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలి’

NTR: తిరువూరులో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణయ్య శుక్రవారం హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలన్నారు. 2019 నుంచి ఉద్యోగం చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 02:23 PM IST

పెంటపాడులో కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట

W.G: పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో శ్రీ కనక దుర్గా దేవి నూతన ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

February 20, 2026 / 02:21 PM IST

నర్సీపట్నంలో లేగ దూడల ప్రదర్శన

AKP: నర్సీపట్నం(మం) చెట్టుపల్లిలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. రైతుల్లో పాడి పశువుల పెంపకంపై అవగాహన పెంచుతున్నామన్నారు. మేలు రకము సంతతిని వృద్ధి చేయడానికి పశుసంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

February 20, 2026 / 02:20 PM IST

‘అత్యాచార నిరోధక చట్టం అమలు చేయాలి’

KRNL: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలును అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని జేసి నూరుల్ ఖమర్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై జేసీ అధికారులతో చర్చించారు. ఇందులో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు, పత్తికొండ RDOలు సందీప్, భరత్ ఉన్నారు.

February 20, 2026 / 02:19 PM IST

పోలీసుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అసెంబ్లీలో పోలీసు శాఖ సమస్యలపై ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న పని భారం, సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులకు తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

February 20, 2026 / 02:19 PM IST

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పరిశీలన

BPT: కర్లపాలెం మండలం ఎంవీరాజుపాలెంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కొనసాగుతుంది. ఈ మేరకు ఇవాళ సర్వేను బాపట్ల ఆర్డీవో గ్లోరియా, ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీదేవి పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సర్వే నమోదు విధానాన్ని పరిశీలించారు. కుటుంబ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.

February 20, 2026 / 02:16 PM IST

కోటూరులో రాష్ట్ర స్థాయి పూటీ లాగుడు పోటీలు

కృష్ణా: కోడూరులో రాష్ట్రస్థాయి పూటీ లాగుడు బల ప్రదర్శన(పోటీలు) నిర్వహిస్తున్నట్లు పసుపులేటి రాము (దాణాకొట్టు) అన్నారు. కోడూరు శివారు స్వతంత్రపురం గవర్నమెంట్ హాస్పటల్ సమీపంలో పూతబోయన వెంకయ్య స్థలంలో మార్చ్ 8వ తేదీ పూటీ ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కావున ఆసక్తిగల ఎడ్ల యజమానులు మార్చ్ 1వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 02:16 PM IST

గ్రామాభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సొంటెన్న

KRNL: కూటమి ప్రభుత్వంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని టీడీపీ గ్రామ అధ్యక్షులు బోయ సొంటెన్న, బూత్ ఇన్ ఛార్జ్ దుమ్మల శివ, నాయకులు రామలింగ, నరసయ్య స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరు మండలం హెచ్ మురవణి గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పని చేయాలన్నారు.

February 20, 2026 / 02:15 PM IST

‘రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలి’

VZM: ప్రతిఒక్కరూ విధిగా తమ విధులు బాధ్యతలను తెలుసుకోవాలని గజపతినగరం జడ్జి ఏ.విజయ రాజ్‌ కుమార్‌ సూచించారు. శుక్రవారం స్దానిక బోడసింగిపేటలో ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ముఖ్యంగా రాజ్యాంగంపై పౌరులు అవగాహన కల్పించుకోవాలని చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 02:10 PM IST

సైబర్ నేరగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్సై

KDP: ఎన్నికల సమయంలో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ముద్దనూరు ఎస్సై ఎన్. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ముద్దునూరు మండలం కండ్లోపల్లి గ్రామంలో సైబర్ నేరాలు, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎవరైనా అనుమాన వ్యక్తులు కనబడితే 112కి సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.

February 20, 2026 / 02:10 PM IST

విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న పరిటాల శ్రీరామ్

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం మల్లాకాల్వ గ్రామంలో నిర్వహించిన లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో జరిగిన ప్రతిష్ఠాపన వేడుకలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

February 20, 2026 / 02:07 PM IST