• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మదనపల్లిలో రూ. 60 లక్షల భూ అగ్రిమెంట్ వివాదం

అన్నమయ్య: మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదమైంది. ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు, డీకే తేజస్విని పేరుపై ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్ముతామని చెప్పి రూ.60 లక్షలకు అగ్రిమెంట్ చేసుకుని మోసం చేశారని శుక్రవారం బాధితుడుఆరోపించారు. కే. అమర్నాథ్ 2022 నుంచి డబ్బు విషయంలో ఇబ్బందులు పెడుతున్నాడని, డబ్బు అడిగితే రౌడీలతో బెదిరిస్తున్నాడని వాపోయారు.

February 20, 2026 / 02:05 PM IST

అమరావతికి మణిహారంగా ఇన్నర్ రింగ్ రోడ్డు

GNTR: రాజధానిలో రూ.40,847 కోట్ల భారీ వ్యయంతో ఇన్నర్ రింగ్ రోడ్డు (IRR) ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించింది. 96.2 కిలోమీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రూపొందుతున్న ఈ రహదారిని 8+4 వరుసలుగా డిజైన్ చేశారు. ఇందులో ప్రధాన ప్రయాణం కోసం 8 వరుసల రహదారి ఉండగా, స్థానిక రవాణా అవసరాల కోసం అదనంగా మరో 4 వరుసల సర్వీస్ రోడ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

February 20, 2026 / 02:05 PM IST

ఆంజనేయస్వామి ప్రతిష్టలో పాల్గొన్న తెలుగు యువత అధ్యక్షులు

SKLM: సారవకోట(మం) తల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో శుక్రవారం జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాస్ నాయుడు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం దాస్ నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.

February 20, 2026 / 02:04 PM IST

ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు

VSP: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. 85 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు మొత్తం 81,001 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కేంద్రాల వద్ద బందోబస్తు, 144 సెక్షన్ అమలు, వైద్య శిబిరాలు, తాగునీరు, అదనపు బస్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

February 20, 2026 / 02:01 PM IST

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ

కృష్ణా: పార్లమెంట్‌లో నిర్వహించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ వల్లభనేని బాలశౌరి శుక్రవారం పాల్గొనారు. ఈ సమావేశంలో స్కిల్ ఎక్కువైజేషన్ నాలెడ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ కార్యక్రమానికి సంబంధించి విధి నిర్వహణ కమిటీపై కమిటీ సభ్యులతో ఆయన విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

భారతి సిమెంట్స్ వద్ద ఉద్రిక్తత

కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూములు కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగగా, జీతాలు సరిపోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

February 20, 2026 / 02:01 PM IST

‘హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం’

E.G: వైసీపీ శాసనమండలి సభ్యులు, మాజీ సీఎం జగన్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని వెంటనే వారు క్షమాపణ చెప్పాలని నిడదవోలు MLA, మంత్రి కందులు దుర్గేష్ శుక్రవారం డిమాండ్ చేశారు. శాసనమండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ, స్వామి వారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హిందూ దేవతలను అవమానించడమే వైసీపీ లక్ష్యం అని మంత్రి అన్నారు.

February 20, 2026 / 02:01 PM IST

ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కమిషనర్

కృష్ణా: గుడివాడ లోని కార్మికానగర్, సాయినగర్, చెంచుపేట ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ మనోహర్ శుక్రవారం పర్యటించారు. స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించి, ఎక్కడైనా లీకేజీలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించి సరిదిద్దాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

February 20, 2026 / 01:51 PM IST

‘అలాంటి పాఠశాలలను వెంటనే సీజ్ చేయాలి’

ATP: గుంతకల్‌లోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఎదుట శుక్రవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం పూర్తవకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలను వెంటనే సీజ్ చేయాలని, ఫీజుల దోపిడిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.

February 20, 2026 / 01:49 PM IST

రాజీ కుదిరేనా? రాజకీయ వర్గాల్లో ఆసక్తి

అన్నమయ్య: సుగవాసి ప్రసాద్ బాబు – మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మధ్య విభేదాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. మార్చి 2న అన్నమయ్య పార్లమెంట్ అధ్యక్షుడిగా సుగవాసి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, కార్యక్రమానికి మంత్రి హాజరవుతారా? అనే అంశం కార్యకర్తల్లో ఆసక్తి రేపుతోంది. నాయకుల మధ్య విభేదాలు పార్టీపై ప్రభావం చూపుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

February 20, 2026 / 01:47 PM IST

‘ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి’

W.G: మొగల్తూరు డీసీసీబీ బ్రాంచ్ వద్ద సహకార సంఘ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం ఐదవ రోజుకు చేరుకుంది. ఉద్యోగుల జీతాల పెంపు వల్ల ప్రభుత్వానికి పైసా భారం ఉండదని, సహకార సంఘాల లాభాల నుంచే చెల్లింపులు జరుగుతాయని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు.

February 20, 2026 / 01:45 PM IST

గోదావరి మోక్షధామం స్మశాన వాటికకు శంకుస్థాపన

W.G: పెనుగొండ మండలం సిద్ధాంతంలో వశిష్ఠ గోదావరి నది ఒడ్డున రూ. 3 కోట్లతో గోదావరి మోక్షధామం స్మశాన వాటిక నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజమండ్రి తర్వాత గోదావరి జిల్లాల్లో ఈ తరహా స్మశాన వాటిక నిర్మాణం ఈ ప్రాంతంలోనే జరుగుతుందని, అత్యాధునిక హంగులతో స్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

February 20, 2026 / 01:43 PM IST

స్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన

ELR: కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ ఎంపీ నిధుల నుంచి స్మశాన వాటిక అభివృద్ధికి ఇటీవల రూ. 20 లక్షలు కేటాయించారు. స్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగిన అనంతరం శుక్రవారం స్మశాన వాటిక అభివృద్ధి పనులను కూటమి నాయకులు పరిశీలించారు. అలాగే పనులు చాలా నాణ్యతగా జరగాలని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.

February 20, 2026 / 01:42 PM IST

కర్నూలులో ఎస్సీ, ఎస్టీ చట్టం అమలు

కర్నూలు కలెక్టరేట్‌లో JC నూరుల్ ఖమర్ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు జిల్లా విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఉపాధి, ఇళ్ల స్థలం, ఇతర ప్రయోజనాలను త్వరగా మంజూరు చేయాలని సూచించారు.

February 20, 2026 / 01:40 PM IST

ఆకివీడులో గంటా షైనీకి సన్మానం

W.G: అంతర్జాతీయ మల్టీ టాలెంటెడ్ పురస్కారం, నేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డ్, నంది అవార్డు అందుకున్న ఆకివీడుకు చెందిన ఘంటా షైనీని శుక్రవారం సన్మానించారు. ఆకివీడులోని స్థానిక ప్రైవేట్ స్కూల్ ఛైర్మన్ ఉండ్రమట్ల సాంబశివరావు సన్మానించి పదివేల రూపాయలు చెక్కును అందజేశారు. ఆకివీడు ఖ్యాతిని షైనీ దశదిశలా విస్తరింప చేస్తుందన్నారు.

February 20, 2026 / 01:40 PM IST