KRNL: ఆదోనిని జిల్లాగా ప్రకటించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. శుక్రవారం ప్రత్యేక జిల్లా హోదా ప్రకటించే వరకు తమ ఓటు వేయబోమని పలువురు గ్రామస్తులు హెచ్చరించారు. రానున్న సర్పంచ్, MPTC, ZPTC ఎన్నికలను బహిష్కరిస్తామని ప్రకటించారు. ఆదోనికి జిల్లా హోదా కల్పించాలని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ ఉద్యోగం నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరిష్కారానికి అవకాశం గల ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్‌కు నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సంతకం చేసి పదవిని చేపట్టారు. “చిల్లి సిటీ ఆఫ్ ఇండియా”గా గుర్తింపు పొందిన మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఈ సందర్భంగా అప్పారావు పేర్కొన్నారు.
ప్రకాశం: యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను సమగ్రంగా పర్యవేక్షించాలని ఎంపీడీవో వీరభద్రాచారి సూచించారు. శుక్రవారం ఆయన కంభం పట్టణంలోని ఫ్యామిలీ సర్వేను పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు.పెండింగ్‌లో ఉన్న వివరాలను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
TPT: ట్రాఫిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిబ్బంది విద్యార్థినులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు సంకేతాలు, మైనర్లు వాహనాలు నడపరాదనే చట్టాలపై వివరించారు. మొబైల్ వినియోగం, ప్రమాదాలపై హెచ్చరించారు.
ATP: రంజాన్ మాసంలో వచ్చే తొలి శుక్రవారం (జుమా) నమాజ్‌కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇందులో భాగంగా గుత్తి కేబీఎన్ మసీదులో శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు ఇమామ్ హుస్సేన్ మాట్లాడుతూ.. రంజాన్ ప్రాముఖ్యత, ఉపవాసం, దానధర్మాలు ఆధ్యాత్మికత గురించి ప్రత్యేక ఉపన్యాసాలు చేశారు. నమాజ్‌కు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు.
NLR: బుచ్చి పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లకు రథోత్సవం వేడుకగా జరిగింది. రథం లాగేందుకు యువత పోటీ పడ్డారు. అడుగడుగునా స్వామి అమ్మవార్లకు భక్తులు కర్పూర హారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథోత్సవాన్ని తిలకించారు.
విజయనగరం స్థానిక పూల్ బాగ్ కాలనీలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీ అయోధ్య బాలక్ రామ మందిర్ ట్రస్ట్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బారావు ఆధ్వర్యంలో అర్చకులు వేకువ జామున సుప్రభాతసేవ, శాంతి హోమం, పూర్ణాహుతి, పూజలు జరిపారు. అనంతరం అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలోని సడ్లపల్లిలో శ్రీ సూగూరు సీతారామాంజనేయ స్వామి నూతన విగ్రహవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ పాల్గొని పూజలు నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ.. ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని తెలిపారు.
KDP: బద్వేల్‌లోని పేదలు, కూలీలు నిత్యం ప్రయాణించే వారి ఆకలి తీర్చడమే ధ్యేయంగా మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకం ‘అన్న క్యాంటీన్’ అని అన్నారు. అతి తక్కువ ధరకే, అత్యంత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని గౌరవప్రదమైన రీతిలో అందిస్తూ వేలాది మంది కడుపు నింపుతోందని మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పేర్కొన్నారు. శుభ్రత, నాణ్యత, ధరలను తనిఖీ చేశారు.
KRNL: అంతర్జాతీయ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా ఆస్పరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సీపీఐ మండల కార్యదర్శి విరుపాక్షి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అసమానతలను తీర్చడానికి, కుల, మత, లింగ వివక్షతను నిర్మూలించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.
NDL: ప్యాపిలి మండలంలోని వంకామేటుపల్లి గుట్టల పల్లెలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులను వెంటనే అప్రమత్తం చేశారు. రెండు గ్రామాల్లో బోర్లు వేసి కొళాయి కనెక్షన్ ఇచ్చి పరిష్కారం చూపారు. ఈ క్రమంలో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి 13 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలు పరిష్కారంలో జాప్యం జరగకూడదని డీఆర్‌డీఏ పీడీ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని 8 మంది దరఖాస్తులు సమర్పించారు. బ్యాటరీ మోటార్ సైకిల్లు మంజూరు చేయాలని ఇద్దరు దరఖాస్తు చేశారని తెలిపారు.
VSP: ప్రచురిత కథనం తమ ప్రతిష్ఠకు భంగం కలిగించిందంటూ దాఖలైన పరువు నష్టం కేసులో ఓ దినపత్రికపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఐటీడీపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చింతకాయల విజయ్ విశాఖ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపించారు.
NTR: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం చంద్రబాబును ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఎంపీ కేసీనేని చిన్ని శుక్రవారం ఘనస్వాగతం పలికారు. దేశంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి అవకాశాలపై నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో పాల్గొనడం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని ఎంపీ తెలిపారు.