• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్

SKLM: ఆమదాలవలస పట్టణంలో గల స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమదాలవలస టీడీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

February 20, 2026 / 08:08 AM IST

ఉద్యోగాల భర్తీకి కర్నూలు కలెక్టర్ నిర్ణయం

KRNL: ఆదోని వన్ స్టాప్ సెంటర్‌లో 13 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఇవాళ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-39 ఏళ్ల మధ్య ఉండాలని, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 24లోపు కలెక్టరేట్లోని ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

February 20, 2026 / 08:04 AM IST

ఈనెల 23న కావలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

NLR: ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు కావలి ట్రంక్ రోడ్డులోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి కళ్యాణ మండపంలో వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

February 20, 2026 / 08:03 AM IST

నేడు మిర్చి యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

GNTR: గుంటూరు మిర్చి యార్డ్ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం జరగనుంది. నూతన ఛైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ ఛైర్మన్‌ బిట్రగుంట మల్లిక, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుజ్జనగుండ్ల చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఈ ఏర్పాట్లను పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ గురువారం పర్యవేక్షించారు.

February 20, 2026 / 08:02 AM IST

ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ

కృష్ణా: ఈనెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలలో పాల్గొనే విద్యార్థులకు మొవ్వ క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాల్ టికెట్లను నిన్న పంపిణీ చేశారు. కళాశాల ఇంఛార్జ్ సుధాకర్ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో జనరల్ కోర్సుకు చెందిన 98 మంది, వృత్తి విద్య కోర్సుకు చెందిన 60 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు.

February 20, 2026 / 08:01 AM IST

రేపు మండల సర్వసభ్య సమావేశం

KRNL: దేవనకొండ మండల పరిషత్ కార్యాలయ సమావేశ భవనంలో రేపు ఉదయం 11 గంటలకు ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ జ్యోతి ఇవాళ తెలిపారు. అన్నిశాఖల అధికారులు ప్రగతి నివేదికలతో రావాలని సూచించారు. అలాగే.. సమావేశానికి ప్రజాప్రతి నిధులు హాజరు కావాలని కోరారు.

February 20, 2026 / 08:00 AM IST

నేడు పెదవేగిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

ELR: పెదవేగి మండలంలోని కూచింపూడి విద్యుత్ ఉపకేంద్రం RDSS పథకం లైన్లు మెరుగుదల పనుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. YSR  బొమ్మ రోడ్డు, శూద్ర వారి మెట్టా, నాలుగు పంచాయతీ బోర్లు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

February 20, 2026 / 08:00 AM IST

అగ్ని ప్రమాదంలో కాఫీ, మిరియాల తోటలు దగ్ధం

ASR: జీ.మాడుగుల మండలం గన్నేరుపుట్టులో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంలో 4 కుటుంబాలకు చెందిన కాఫీ, మిరియాల తోటలు దగ్ధమయ్యాయి. ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పాంగి సీతన్న, చిన్నమ్మి, భీమన్న, మఠం రాంబాబు అనే రైతులకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఉన్న కాఫీ, మిరియాల తోటల్లో మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.

February 20, 2026 / 08:00 AM IST

నేడు, రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: ఉండ్రాజవరం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శుక్ర, శనివారాల్లో విద్యుత్ లైన్ల మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏపీ ఈపీడీసీఎల్ నిడదవోలు ఎస్ఈ ఎన్. నారాయణ అప్పారావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వేలివెన్ను, కాల్దరిలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు.

February 20, 2026 / 07:54 AM IST

విజయవాడకు వెళ్లిన కలెక్టర్

KRNL: జిల్లా కలెక్టర్ ఎ. సిరి గురువారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు గృహ గణన చేపడుతున్నాయి. అందులో భాగంగా రాష్ట్రంలో మే 1 నుంచి 30 వరకు నెల రోజుల పాటు గృహ గణన చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్‌కు అవకాశం ఉంది.

February 20, 2026 / 07:51 AM IST

చెరువులో అనుమానాస్పద స్థితిలో టెన్త్ విద్యార్థిని మృతి

కోనసీమ: ముంగండ ZPHS స్కూల్ 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందింది. మృతదేహాన్ని స్కూల్ సమీపంలోని మంచినీటి చెరువులో కనుగొన్నారు. సాయంత్రం వరకు స్కూలు ప్రాంగణంలో వాలీబాల్ ఆడిందని సహచర విద్యార్థులు తెలిపారు. ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. అనుమానం వచ్చి చెరువును పరిశీలించగా కరుణ మృతదేహం లభ్యమయింది.

February 20, 2026 / 07:49 AM IST

పేకాట స్థావరంపై దాడి.. 14 మంది అరెస్ట్

AKP: బుచ్చయ్యపేట మండలం థైపురం వద్ద పోలీసులు మెరుపు దాడి చేసి భారీ పేకాట స్థావరాన్ని ఛిన్నభిన్నం చేశారు. ఈ దాడిలో 14 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.5,600 నగదు, మూడు కార్లు, రెండు బైకులు, 14 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన వారిలో 11 మంది పాత నేరస్థులని, ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

February 20, 2026 / 07:44 AM IST

నేడు కాశీ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

AKP: మునగపాకలో కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ ఎస్.రాము తెలిపారు. ఈ మేరకు గురువారం ఆలయంలో పెళ్లిరాట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు కళ్యాణం, మధ్యాహ్నం అన్న సమారాధన, సాయంత్రం ఊరేగింపు ఉంటుందన్నారు.

February 20, 2026 / 07:40 AM IST

పేకాట స్థావరాలపై దాడి.. ఇద్దరు నిందితులు అరెస్ట్

SS: కదిరి సబ్ డివిజన్ వ్యాప్తంగా పేకాట కేంద్రాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. గురువారం తలుపుల మండలంలోని గుండువారిపల్లి సమీపంలో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై చెన్నయ్య సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 12,650 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

February 20, 2026 / 07:39 AM IST

మాజీ సీఎం జగన్‌ను కలిసిన గిరజాల బాబు

E.G: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడియంకు చెందిన రాష్ట్ర వైసీపీ కార్యదర్శి గిరజాల బాబు గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనకు అప్ప చెప్పిన పార్టీ యొక్క బాధ్యతలు, పరిస్థితులు జగన్‌తో చర్చించారు. ప్రజా సమస్యల కొరకు పోరాడుతూ, కార్యకర్తలకు అండదండలు అందించాలని సూచించారు.

February 20, 2026 / 07:39 AM IST