• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అనారోగ్య బాధితునికి ఆర్థిక సహాయం అందజేత

కోనసీమ: రామచంద్రపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన చొల్లంగి సుబ్రహ్మణ్యం గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనికి విశాఖపట్నంకు చెందిన వ్యాపారవేత్త పోతంశెట్టి ఆంజనేయులు రెడ్డి మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా సోమవారం రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారు. మంత్రి మాట్లాడుతూ.. తానే కాకుండా తన మిత్రులు కూడా సహాయం చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.

February 23, 2026 / 08:37 PM IST

మాజీ సీఎంను ఆహ్వానించిన మాజీ సీఎం

WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.

February 23, 2026 / 08:36 PM IST

మాజీ సీఎంను ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ

WG: మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడు సందీప్ వివాహ రిసెప్షన్ మార్చి 9న రాజమహేంద్రవరంలో జరగనున్న నేపథ్యంలో, జగన్‌ను కుటుంబ సమేతంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. శేషుబాబుతో పాటు ఆయన సతీమణి శశికళ, రవిశంకర్ నారాయణ (IRS), సిద్ధార్థ తదితరులు జగన్‌ను కలిసి ఆత్మీయంగా ఆహ్వానించారు.

February 23, 2026 / 08:36 PM IST

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి: ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో రూ.20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి, చిలుకూరులో రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్వచ్ఛంధ్ర-స్వర్ణాంధ్ర లక్ష్యంతో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే ప్రధాన ధ్యేయంతో కృషి చేస్తునమన్నారు.

February 23, 2026 / 08:36 PM IST

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ‘అనంత’*

అనంతపురం: రంజాన్ మాసంను పురస్కరించుకుని అనంతపురం నగరంలోని 2వ రోడ్ వద్ద ఉన్న బాబుద్ధిన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ వసీం హాజరయ్యారు. మసీదు నందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, మసీదు కమిటీ మెంబర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 23, 2026 / 08:34 PM IST

ముగ్గురిపై బైండోవర్ కేసులు

ELR: టి.నరసాపురం మండలం బంధంచర్ల గ్రామానికి చెందిన ముగ్గురుని మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద బైండోవర్ చేసినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలు అయిన గుమ్మల్ల లక్ష్మణరావు, కొండా పుల్లయ్య, రాచప్రోలు అరుణ్ అనే వ్యక్తులపై బైండోవర్ విధించడం జరిగిందన్నారు. సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.

February 23, 2026 / 08:32 PM IST

జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి

అన్నమయ్య: రామసముద్రం మండలం గంపనంపల్లికి చెందిన పవిత్ర (17) తిరుపతిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 20న జ్వరం రావడంతో పద్మావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. పరిస్థితి విషమించడంతో రుయా ఆసుపత్రికి తరలించగా.. ఇవాళ చికిత్స మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

February 23, 2026 / 08:31 PM IST

గ్రామస్తుల మర్యాదపూర్వక ఆహ్వానం

అన్నమయ్య: సుండుపల్లె మండలం చిన్నగొల్లపల్లె పాత జంగంపల్లెలో జరగనున్న శ్రీ గౌరిసమేత జంగమేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన, కల్యాణ మహోత్సవాలకు హాజరు కావాలని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ప్రసాద్ బాబు‌ను గ్రామస్తులు ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

February 23, 2026 / 08:31 PM IST

ఎస్పీ గ్రీవెన్స్‌కు 51 వినతులు

SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు ఎస్పీ కేవీ రమణ సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 51 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ తెలిపారు.

February 23, 2026 / 08:30 PM IST

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్

కృష్ణా: సాధారణ తనిఖీల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న EVM గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ తనిఖీ చేశారు. గోడౌన్ సీల్‌ను, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఎన్నికల భద్రత దృష్ట్యా అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.

February 23, 2026 / 08:30 PM IST

ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు కౌన్సిలింగ్

ప్రకాశం: కంభం పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు స్థానిక ఎస్సై శివ కృష్ణారెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు నడుపుతున్న వాహనాలను స్వాధీనం చేసుకొనివాహన యజమానులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్ ఇచ్చి, జరిమానా విధించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చివారు రోడ్డు ప్రమాదానికి కారణమైతే వాహన యజమానిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

February 23, 2026 / 08:30 PM IST

అధికారులు స్పందించారు.. మురుగు తొలగించారు

తూ.గో: రాజమండ్రి ఆవ వాంబే కాలనీలో పేరుకుపోయిన పారిశుద్ధ్య సమస్యను ఆర్ఎమ్‌సీ అధికారులు సోమవారం పరిష్కరించారు. డ్రైనేజీలు పూడికతో నిండి మురుగు నిలిచిపోవడంతో, స్థానికులు ‘జనతా వారధి’ వేదికలో ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన అధికారులు జేసీబీలతో మురుగును తొలగించి శుభ్రం చేశారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

February 23, 2026 / 08:28 PM IST

‘స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలి’

PPM: ఫిర్యాదు చేసిన వ్యక్తి పలుమార్లు స్టేషన్ చుట్టూ తిరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం తొమ్మిది పిర్యాదులు వచ్చాయన్నారు.

February 23, 2026 / 08:27 PM IST

‘పరిహారం పెంచి ఇవ్వాలి’

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో 2016లో తీసుకున్న భూములకు రేటు పెంచాలని మత్యకారులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నక్కపల్లిలో నర్సీపట్నం ఆర్డీవో వీవీ రమణను కలిసి వినతిపత్రం అందజేశారు. అప్పుడు ఎకరం రూ.18 లక్షల మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రేట్ల ప్రకారం రూ.32 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని వారికి తెలిపారు.

February 23, 2026 / 08:21 PM IST

25న గుంటూరుకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్

GNTR: ఏపీ రాష్ట్ర గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఈనెల 25న గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక క్యాత్ ల్యాబ్, కార్డియాక్ OTలను ప్రారంభించి, అనంతరం కాలేజీ 22వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సూపర్డెంట్ డాక్టర్ కిరణ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

February 23, 2026 / 08:20 PM IST