తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్బంగా శానిటరీ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తిరుపతి నగర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు తెలిపింది.
తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ (CM Jagan) వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
టీడీపీ- జనసేన కమిటీకి సంబంధించి స్పష్టత వచ్చింది. సోమవారం మధ్యాహ్నాం ప్రకటించి.. ఆ వారంలో ఫస్ట్ మీటింగ్ నిర్వహించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు కోరారని తెలిసింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈ సారి పోటీ చేసే స్థానాన్ని సరిగా ఎంపిక చేసుకోవాలని.. అందుకే తిరుపతి పేరు సజెస్ట్ చేశారని తెలిసింది.
పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర నారాయణకు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఓ వ్యక్తి ఎమ్మెల్యే కాన్వాయ్ పై డిటోనేటర్ తో దాడి చేశాడు. గోరంట్ల మండలం గడ్డం తండా పంచాయతీ పరిధిలో ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం తేదీ ఖారారైంది. అక్టోబర్ 22న వంగవీటి రాధా కృష్ణ పుష్పవల్లిలో పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రింట్ చేసిన వీరి వెడ్డింగ్ కార్డు నెట్టింట్ వైరల్ గా మారింది.
అక్టోబరు 8న విజయవాడలో శంఖనాధ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి(Meenakshi Lekhi) హాజరు కాగా..ఏపీలో ఉన్న పలువురు కీలక నేతలతోపాటు బీజేపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఏపీ మంత్రి రోజాపై కామెంట్స్ చేసిన బండారు సత్య నారాయణపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బండారు వెంటనే రోజాకు సారీ చెప్పాలని ఎంపీ నవనీత్ కౌర్, నటి రాధిక శరత్ కుమార్ డిమాండ్ చేశారు.