»Vangaveeti Radhakrishna Wedding Date Fix On October 22nd 2023 Wedding Card Viral
Vangaveeti Radhakrishna: పెళ్లి డేట్ ఫిక్స్..వెెడ్డింగ్ కార్డ్ వైరల్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వివాహం తేదీ ఖారారైంది. అక్టోబర్ 22న వంగవీటి రాధా కృష్ణ పుష్పవల్లిలో పెళ్లి జరగనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రింట్ చేసిన వీరి వెడ్డింగ్ కార్డు నెట్టింట్ వైరల్ గా మారింది.
Vangaveeti Radhakrishna Wedding date Fix on october 22nd 2023 Wedding Card Viral
మాజీ ఎమ్మెల్యే, వంగవీటి మోహన రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ పెళ్లికి ముహూర్తం ఫిక్సైంది. అక్టోబర్ 22 (ఆదివారం) రాత్రి 7.59 గంటలకు శ్రవణ నక్షత్రయుక్త వృషభ లగ్నానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ-నిడమనూరు పోరంకి రోడ్డులోని మురళీ రిసార్ట్స్‌లో ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే శుభలేఖలు సిద్ధం చేశారు. ఈ నెల 22న రాధ, పుష్పవల్లి వివాహం జరగనుంది. ఈ క్రమంలో వంగవీటి రాధా, పుష్పవల్లి పెళ్లి కార్డు వైరల్‌గా మారింది. ఈ వివాహ వేడుకకు రంగా, రాధా అభిమానులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. అందుకు తగ్గట్టుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసపురన్నకు చెందిన జక్కం బాబ్జీ, అమ్మని దంపతుల కుమార్తె పుష్పవల్లితో వంగవీటి రాధ నిశ్చితార్థం జరిగింది. పుష్పవల్లి నరసాపురంలో చదివింది. తర్వాత హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించి కొంతకాలం హైదరాబాద్‌లో యోగా టీచర్‌గా పనిచేశారు. పుష్పవల్లి కూడా రాజకీయ కుటుంబానికి చెందినవారే. పుష్పవల్లి తల్లి జక్కం అమ్మని 1987-92 వరకు టీడీపీ నుంచి నరసాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆమె తండ్రి గతంలో నరసాపురం టీడీపీలో కీలక నేత. అయితే కొంతకాలంగా కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. ఇటీవల నరసాపురంలో కొత్త ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. జక్కం బాబ్జీ ఇటీవల జనసేన పార్టీలో చేరారు. వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ నరసాపురం వచ్చి వారి ఇంట్లో బస చేశారు. ఇటీవల వంగవీటి రంగా జయంతి సందర్భంగా వంగవీటి రాధా నివాసంలో వేడుకలు జరిగాయి.
ఇక వంగవీటి రాధా 2004లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి..విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత రాధా వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి.. పోటీకి దూరంగా ఉంటూ.. టీడీపీ అభ్యర్థుల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు.
2019 ఎన్నికల ఫలితాల నుంచి రాధా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. కొద్దిరోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే తాను ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోలేదని.. అలాగే అమరావతి రైతుల ఉద్యమానికి రాధా మద్దతు తెలిపారు. రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ సమావేశాలు, కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో రెండు మూడు సార్లు పాల్గొన్నారు. మరి 2024 ఎన్నికల నాటికి రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.