ప్రభుత్వ కార్యాలయాల తరలింపును అమరావతిలో రైతులు సవాల్ చేస్తూ పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన హైకోర్టు దానిని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది.
ఏపీలో వాలంటీర్ల జీతాన్ని జనవరి నెల నుంచి పెంచుతున్నట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. సీఎం జగన్ పుట్టిన రోజు కానుకగా వాలంటీర్ల జీతాన్ని రూ.750లు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో అక్రమాలు, దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో మాట్లాడారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు.
యువగళం పాదయాత్ర అనేది జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ని ఇంటికి పంపించి టీడీపీ, జనసేన సర్కార్‌ను ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు.
తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్ర అప్పులు పెరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. ఏడాదికి 12.07 శాతం చొప్పున అప్పులు పెరిగాయని.. మొత్తం 168 శాతం పెరిగాయని లెక్కలతో సహా వివరించారు.
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 33 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లుగా వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు తెలిపారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ్వరం కారణంగా నిన్న రాత్రి అస్వస్థతకు గురయ్యారు. నేడు టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టే యువగళం నవశకం సభకు కూడా పవన్ రాకపోవచ్చని జనసేన వర్గాల సమాచారం.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం నవశకం పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభ రేపు పోలిపల్లిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరానున్నారు.
నెల్లూరు జిల్లా వరదాపురం గ్రామంలో గడువు పూర్తైన మైకా క్వారీ నుంచి అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నానరని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు బలవంతంగా విరమింపజేశారు.
ఆరోగ్య కింద రూ.25 లక్షల వైద్యం అందించనున్నట్లు ఏపీ సీఎం జగన్ వెల్లడించారు. వైద్యం కోసం ప్రతి ఒక్కరూ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఇకపై రాకూడదని అన్నారు. కొత్తగా ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు.