ఏపీ మంత్రి రోజాపై కామెంట్స్ చేసిన బండారు సత్య నారాయణపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. బండారు వెంటనే రోజాకు సారీ చెప్పాలని ఎంపీ నవనీత్ కౌర్, నటి రాధిక శరత్ కుమార్ డిమాండ్ చేశారు.
Now Navaneet Kaur And Radhika Slams Bandaru Satya Narayana
Navaneet Kaur: ఏపీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అతని కామెంట్లను రాజకీయ నేతలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. రోజాకు వెంటనే సారీ చెప్పాలని జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు ఖుష్బూ డిమాండ్ చేయగా.. ఆమె వెంట సినీ నటులు రాధ, నవనీత్ కౌర్ (Navaneet Kaur) నిలిచారు.
బండారు (bandaru) అసలు మీకు సిగ్గుందా అంటూ నవనీత్ కౌర్ రెచ్చిపోయారు. దిగజారి మాట్లాడతావా అని ఫైరయ్యారు. మీ ఇంట్లో భార్య, చెల్లి, కూతురు లేరా అని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో మహిళలను గౌరవిస్తారు.. బండారు మాత్రం తగ్గించేలా మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయాలు ముఖ్యమా.? మహిళల గౌరవం ముఖ్యమా అని అడిగారు. ఎంపీగా, నటిగా, మహిళగా, రోజాకు అండగా నిలిచారు. యావత్ మహిళలంతా రోజాకు అండగా ఉంటారని తెలిపారు. రోజా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. స్టార్ హీరోల సరసన నటించారు.. ఆమెను కించపరచడం సరికాదు.
రోజాకు క్షమాపణ చెప్పాలని బండారు సత్యనారాయణను నటి రాధిక డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చే మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ విరుచుకుపడ్డారు. మాటలతో హింసించడం సిగ్గుచేటు అన్నారు. క్షమాపణ చెప్పి గౌరవాన్ని కాపాడుకోవాలని స్పష్టం చేశారు. ఇవి ముమ్మాటికీ లో క్వాలిటీ పాలిటిక్స్.. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తోన్న సమయంలో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని మోడీ దృష్టిసారించాలని కోరారు.