TPT: తిరుపతి భవాని నగర్‌లోని రమాదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై వెంటనే విచారణ జరిపి సీజ్ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో చికిత్స పొందుతూ మృతి చెందిన యువకుడి కుటుంబం నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, మృతదేహాన్ని ఇవ్వడానికి కూడా రూ.45 వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు.
W.G: పోడూరు మండలం కవిటంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి PA మోహన్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సతీష్ కుమార్, సొసైటీ అధ్యక్షుడు ఊడిగ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
AKP: ఎలమంచిలి మండలం ఏటికొప్పాకలో ఈనెల 8న నాటు తుపాకీ ప్రమాదవశాత్తు పేలి ఆడారి కౌశిక్ (12) మృతి చెందిన ఘటనలో మంగళవారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. లైసెన్స్ లేకుండా కె. సూరిబాబు వద్ద రెండు నాటు తుపాకులు కలిగి ఉన్నట్లు తెలిపారు. సూరిబాబు కొడుకు తన స్నేహితులను ఇంటికి తీసుకువెళ్లి నాటు తుపాకీలు చూపిస్తున్న సందర్భంగా ఒకటి మిస్ ఫైర్ అయిందని పేర్కొన్నారు.
VZM: కొత్తవలస ఎన్జీవో భవనంలో మంగళవారం జరిగిన 20 మందితో నూతన ఏపీజేఏసి కమిటీని ఎన్నుకొన్నారు. ఏపీజేఎసి ఛైర్మన్‌గా జే.వీ.ప్రసాదరావు ఎన్నికవ్వగా, కార్యదర్శిగా ఎం. కుమార్ నియమితులయ్యారు. నూతన కమిటీ ఏపీజేఏసి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయంలో శానిటరీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న MVRL ప్రసాద్ నియమితులయ్యారు.
ప్రకాశం: కంభం మండలంలోని ఎర్రబాలెం గ్రామానికి రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన తారురోడ్డు పనులు పూర్తయ్యాయి. రోడ్డు నిర్మాణం పూర్తవడంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
PPM: మున్సిపాలిటీ పరిధిలోని బహుళ అంతస్తుల భవనాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మున్సిపల్ యంత్రాంగం చిత్తశుద్ధితో ఉందని మున్సిపల్ కమిషనర్ జీ.శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. ఓ పత్రికలో వచ్చిన కథనానికి బహుళ అంతస్తులు అందని వసతులపై ఆయన పై విధంగా స్పందించారు .ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు.
ATP: గుత్తి కోట ఉత్సవాలను ఈనెల 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్ వెల్లడించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గుత్తి ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో రెండు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. జిల్లా ఖ్యాతి పెరిగేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గుంటూరు సంగడిగుంటలోని శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలు 1వ తరగతి విద్యార్థిని చెంపలపై కొట్టిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మండల విద్యా అధికారి (గుంటూరు తూర్పు) షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఘటనపై పూర్తి వివరణను ఒక రోజు లోపు సమర్పించాలని పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు. వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
KRNL: మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కర్నూలు మీదుగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులను సామర్థ్యానికి మించి ఎక్కించుకోకూడదని వాహనాల డ్రైవర్లకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం స్పష్టం చేశారు. భక్తుల క్షేమమే ప్రధాన లక్షమని తెలిపారు. లోడింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతాయన్నారు. అటువంటి వాహనాలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
KKD: బాణసంచా తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. మంగళవారం కరపలోని తయారీ యూనిట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం మూసివేసి ఉన్న కేంద్రాల యజమానులతో మాట్లాడారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
KKD: బాణసంచా తయారీ కేంద్రాలు పూర్తిస్థాయిలో భద్రతా నిబంధనలు పాటించాలని ఎస్పీ బిందుమాధవ్ స్పష్టం చేశారు. మంగళవారం కరపలోని తయారీ యూనిట్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం మూసివేసి ఉన్న కేంద్రాల యజమానులతో మాట్లాడారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు
KDP: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ కడప RDO కార్యాలయం వద్ద AITUC ఆధ్వర్యంలో నిరసన జరిగింది. అమెరికా,ఇజ్రాయిల్ దాడుల వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు వాటిల్లుతుందన్నారు. దౌత్య మార్గాల ద్వారా శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేశారు.
TPT: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లి నివాసంలో గూడూరు జడ్పీటీసీ ఊటుకూరు యామిని మహేందర్ రెడ్డి, జగనన్న సేవా సమితి అధ్యక్షులు మహేందర్ రెడ్డిలు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీ స్థితిగతులపై జగన్ వారితో చర్చించినట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతమై విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
TPT: వడమాలపేట మండలంలో 20 కేజీల గంజాయి పట్టుకొని, నలుగురిని అరెస్టు చేసినట్లు పుత్తూరు DSP రవికుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫ్లయింగ్ స్క్వాడ్, ఇతర సిబ్బంది వడమాలపేట మండలంలోని టీటీడీ స్థలాల సమీపంలో ఒక మోటార్ సైకిల్, స్కూటీని తనిఖీ చేయగా వారి వద్ద 20 కేజీల గంజాయి పట్టుబడినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలియజేశారు.