CTR: చౌడేపల్లి మండలం ఆమెనిగుంట గ్రామ సమీపంలో శుక్రవారం పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం రేగింది. నేలపై రక్తం, నిమ్మకాయలు, రకరకాల పూజ సామాగ్రితో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: బేతంచర్ల పట్టణం శివార్లలోని డోన్ రోడ్డులో నయారా పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకి, ఇద్దరు గాయపడ్డారు. హెచ్ కొటాల నుంచి వెళ్తున్న ఒక బైక్, డోన్ వైపు నుంచి వచ్చే మరొక బైక్‌ను ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
PLD: వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ మురళీకృష్ణ మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రైతులు లాభాల కోసం సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యానవన పంటల వైపు మళ్లాలన్నారు. త్వరలో శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
ELR: ఉంగుటూరు మండలములో యర్రమిల్లిపాడు నాచుగుంట, గోపీనాథ్ పట్నం చేబ్రోలు గ్రామాలలో శుక్రవారం రాత్రి అక్షరాంద్ర కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలో అక్షర ఆంధ్ర కేంద్రాలు పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాలంటరీలు నిర్లక్ష్య రాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు.
ASR: రాష్ట్రంలోని ప్రధాన హిందూ దేవాలయాల్లో GCC ఆధ్వర్యంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలని GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీని కోరారు. అమరావతిలో ఆయనను కలిసి ప్రతిపాదనలు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో GCC స్టాల్స్‌కు సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
CTR: జనసేన పార్టీ సీనియర్ నాయకుడు లోచన్ శ్రీరామ్ DJI ఎయిర్3Sడ్రోన్‌ను ఎస్పీ తుషార్ దూడి సమక్షంలో విరాళంగా అందజేశారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలను బహిరంగ మద్యపానం, జూదం, దొంగతనాలు పర్యవేక్షించడానికి ఈ డ్రోన్ ఉపయోగిస్తామని ఎస్పీ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్, ప్రజా భద్రతను బలోపేతం చేయడానికి ఈ డ్రోన్ ఉపయోగిస్తామన్నారు.
NDL: డోన్ మండలం జగదుర్తి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెలిసిందే. సీఐ రాకేశ్ వారి మృతదేహాలు బెంగళూరు వాసులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తున్న కారును క్రేన్ ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు, భార్య శాంతా (36), కూతురు భార్గవి (9), కుమారుడు సిద్ధార్థ్ (7) అక్కడికక్కడే మృతి చెందారు.
KDP: దువ్వూరులోని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ అధికారులు, ప్రొద్దుటూరు జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేశారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా రవాణా అవుతున్న వస్తువులను గుర్తించారు. వాటి విలువను అధికారులు లెక్కించారు. సుమారు రూ.3.15 లక్షల పన్ను ఎగవేతను గుర్తించారు.
W.G: ఉండి మండలంలోని వెలివర్రుకు చెందిన వెంకటేశ్వరరాజు (బుడ్డిరాజు) శుక్రవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆక్రమణల పేరుతో ఇటీవల ఇరిగేషన్ అధికారులు తన నివాసాన్ని తొలగించడం పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన దీక్షకు దిగారు. నివాస తొలగింపు, తాజా పరిణామాల నేపథ్యంలో ఉండి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం చర్చనీయాంశంగా మారింది.
KRNL: కోసిగి మండలం కందుకూరులో రేపు జరిగే సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరు కానున్నారు. మార్చి ఒకటో తారీఖు ఆదివారం కావడంతో శనివారం రోజునే సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కందుకూరులో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు.
VSP: పంజాబ్‌లోని జలంధర్‌లో మార్చి 28, 29 తేదీల్లో జరిగే 15వ జాతీయ బాడీ లిఫ్టింగ్ పోటీలకు జిల్లాకు చెందిన కిలాని గణేష్ న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు. వాయుపుత్ర హెల్త్ క్లబ్ చీఫ్ కోచ్‌గా సేవలందిస్తున్న ఆయనకు ఇది ఎనిమిదోసారి జాతీయ స్థాయి బాధ్యత కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక ప్రతినిధిగా ఎంపికైన గణేష్‌ను పలువురు అభినందించారు.
NDL: రేపు బనగానపల్లె పట్టణంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఇవాళ ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని మురళీమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
కోనసీమ: ముఖ్యమంత్రి చంద్రబాబును సీఎం పేషీలో శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కలుసుకున్నారు. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని దేవాదాయశాఖ నుంచి దేవాలయాల అభివృద్ధికి, పుష్కరఘాట్ల అభివృద్ధికి, ఆర్అండ్‌బీ శాఖ నుంచి రహదారుల అభివృద్ధికి, పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు.
PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి ఆదేశాలతో స్కూల్ బస్సు వాహనచోదకులతో పట్టణ ఎస్ఐ, MVIలతో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రాణాలు తమ చేతిలో ఉన్నాయని చోదకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. వాహనం నడిపినప్పుడు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.
VZM: చీపురుపల్లి, రావివలస గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటనకు ఇంఛార్జ్ ఎస్పీ కే.వి.మహేశ్వర రెడ్డి మరియు ఇతర అధికారులతో భద్రత ఏర్పాట్లును విశాఖపట్నం రేంజ్ ఐజీపీ, గోపీనాథ్ జట్టి శుక్రవారం పర్యవేక్షించారు. సభా స్థలం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగు స్థలం, కార్యకర్తలతో సమావేశ స్థలం, పార్కింగు స్థలాలు, పరిశీలించారు.