• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బీచ్ ఫెస్టివల్‌పై సీఎం చంద్రబాబుతో ఎమ్మెల్యే చర్చ

BPT: త్వరలో నిర్వహించనున్న సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కార్యక్రమ ఏర్పాట్లను CM చంద్రబాబుకు వివరించినట్లు బాపట్ల MLA నరేంద్ర వర్మ చెప్పారు. సోమవారం ఆయన CMను కలిసి బీచ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సూర్యలంక అభివృద్ధికి తీసుకోవాల్సిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు.

September 9, 2025 / 06:31 AM IST

‘ఉపాధి హామీ సిబ్బంది సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తా’

SKLM: ఉపాధి హామీ సిబ్బంది యొక్క సమస్యలపై తప్పనిసరిగా అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తానని ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. సోమవారం రాత్రి జిల్లా ఉపాధి హామీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఔట్ సోర్స్ ఉద్యోగులను ఎఫ్‌టీఈలుగా నియమించాలని వారు కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలన్నారు.

September 9, 2025 / 06:31 AM IST

ఆలయ భూముల ఆక్రమణదారులపై కేసులు

KDP: లింగాల మండలంలో దేవాలయ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పులివెందుల ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.వి.రమణ వెల్లడించారు. ఇందులో భాగంగా కోమన్న, తల,పెద్దకూడాల, పార్నపల్లె, ఇప్పట్ల, వెలిదండ్ల, తాతిరెడ్డిపల్లె, లోపట్నూతల గ్రామాల్లో దేవాలయ భూములను కొందరు ఆక్రమించినట్లు గుర్తించామని, ఈ మేరకు MROకు పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని అందించామన్నారు.

September 9, 2025 / 06:30 AM IST

రేపు రాయచోటిలో ఉద్యోగమేళా

అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శివ నర్సింగ్ కళాశాలలో APSDC ఆధ్వర్యంలో ఈనెల 10 నిర్వహించనున్న మెగా ఉద్యోగ మేళాను విజయవంతం చేయాలని DRO మధుసూదన్ రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం వడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆసక్తి కలిగిన యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

September 9, 2025 / 06:30 AM IST

హోంగార్డ్స్ వన్డే కాంట్రిబ్యూషన్ అందజేత

కృష్ణా: పదవీ విరమణ పొందిన హోంగార్డ్ G. జీవరత్నంకి హోమ్ గార్డ్స్ వన్డే కాంట్రిబ్యూషన్ చెక్కును సోమవారం అందజేశారు. హోంగార్డ్స్ ద్వారా వచ్చిన రూ.3,79,140 చెక్కును ఎస్పీ ఆర్ గంగాధర్ రావు చేతుల మీదుగా ఇచ్చారు. 1984లో సేవలు ప్రారంభించిన జీవరత్నం 18-07-2025న రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ ఆయన సేవలను అభినందిస్తూ.. భవిష్యత్తులో పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు.

September 9, 2025 / 06:28 AM IST

జిల్లాలో నిరసనలు చేస్తే చర్యలు తప్పవు: SP

బాపట్ల జిల్లాలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతిలేదని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. మంగళవారం రోజు జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందన్నారు. ఈ క్రమంలో ఎవరు నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. మంగళవారం వైసీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

September 9, 2025 / 06:28 AM IST

అశ్లీల చిత్రాలు చూపించి.. బాలికపై లైంగిక దాడి

CTR: కార్వేటినగరం మండలంలోని ఓ బాలికకు అశ్లీల చిత్రాలు చూపించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో అన్నూరు గ్రామానికి చెందిన హరీష్, హరి(30)కి చిత్తూరు స్పెషల్ పోక్సో కోర్టు మూడేళ్లు జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధించింది. కాగా, బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలంటూ న్యాయమూర్తి ఎం. శంకర్రావు ఆదేశించారు. కాగా, ఈ తీర్పుతో పలువురు పోలీసులను SP అభినందించారు.

September 9, 2025 / 06:26 AM IST

ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు: వెంకటరామిరెడ్డి

ATP: జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ 143 హామీలు ఇచ్చి తూతూ మంత్రంగా కొన్ని మాత్రమే అమలు చేశారన్నారు. ఇప్పుడు ‘సూపర్-6, సూపర్ హిట్’ అంటూ అనంతపురంలో సభ పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు.

September 9, 2025 / 06:26 AM IST

నేటి రైతు పోరు సభను విజయవంతం చేయాలి – కొలగోట్ల

VZM: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించే రైతు పోరు సభను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. సోమవారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఎరువులు దొరకక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.

September 9, 2025 / 06:22 AM IST

రైతులకు డ్రోన్లు అందించిన ఎమ్మెల్యే దివ్య

KKD: వ్యవసాయ సాగులో ఆధునిక సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని ప్రభుత్వ విప్ యనమల దివ్య కోరారు. సోమవారం సాయంత్రం తుని మండలం టి. తిమ్మాపురంలో ఆమె ఇద్దరు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందించిన రెండు వ్యవసాయ డ్రోన్‌లను ప్రారంభించారు. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలను అందిస్తుందని తెలిపారు.

September 9, 2025 / 06:20 AM IST

నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కోనసీమ: ద్రాక్షారామలో విద్యుత్తు తీగల మరమ్మతుల నిమిత్తం కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తామని ఏఈ ఎం. వెంకటరమణ తెలిపారు. పాత ఆంధ్రాబ్యాంకు వీధి, మాగాపువారివీధి, గాంధీ సెంటరు, సాక్షివా రివీధి, మెండువారివీధి, నున్న వారివీధి, ముస్లీంకాలనీ, ఆగావారివీధిలో సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలన్నారు.

September 9, 2025 / 06:20 AM IST

అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవు: SP

PLD: నేడు వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేని ఏ కార్యక్రమానికైనా అనుమతించడం లేదని పేర్కొన్నారు. ఎవరైనా నేర చరిత్ర కలిగిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

September 9, 2025 / 06:20 AM IST

అమరుడి కుమారుడికి కారుణ్య ఉద్యోగ నియామకం

ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో SP కే. ప్రతాప్ శివ కిషోర్ ఎస్సై 1534 పెద్ది రాజు కుమారుడు పీ.నవీన్ కుమార్‌కు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ పత్రాలను సోమవారం అందజేశారు. ఉద్యోగ నిర్వహణలో ప్రాణం త్యాగం చేసిన SI పెద్ది రాజు కుమారుడికి ఈ నియామకం లభించింది. అమరుల కుటుంబాలను ఆదుకోవడం పోలీస్ విభాగ బాధ్యత అని SP తెలిపారు

September 9, 2025 / 06:20 AM IST

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్‌

కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్‌ జరిగింది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావును ప్రజలు, అధికారులు, కార్యకర్తలు కలుసుకుని తమ సమస్యలు వివరించారు. కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపగా, మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులకు సూచించి త్వరిత గతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు.

September 9, 2025 / 06:18 AM IST

గన్నవరం TDP, జనసేన నేతలకు కీలక పదవులు

కృష్ణా: ఏపీ ప్రభుత్వం తాజా నియామకాలలో రెండు పదవులను గన్నవరం నియోజకవర్గం నుంచి భర్తీ చేసింది. జనసేన నేత గరికపాటి శివశంకర్‌ను ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, చిరుమామిళ్ల సూర్యనారాయణ ప్రసాద్‌ను ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమిస్తూ.. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

September 9, 2025 / 06:17 AM IST