ATP: జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ 143 హామీలు ఇచ్చి తూతూ మంత్రంగా కొన్ని మాత్రమే అమలు చేశారన్నారు. ఇప్పుడు ‘సూపర్-6, సూపర్ హిట్’ అంటూ అనంతపురంలో సభ పెట్టడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారని ప్రశ్నించారు.