బాపట్ల జిల్లాలో ఎలాంటి నిరసన కార్యక్రమాలకు అనుమతిలేదని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. మంగళవారం రోజు జిల్లాలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందన్నారు. ఈ క్రమంలో ఎవరు నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. మంగళవారం వైసీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అనుమతిలేదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.