VZM: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించే రైతు పోరు సభను విజయవంతం చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కోరారు. సోమవారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఎరువులు దొరకక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని పేర్కొన్నారు.