• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రోజా కి చిరు కౌంటర్…!

ఏపీ మంత్రి రోజా కి… మెగా స్టార్ చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. ఆయన నటించిన వాల్తేరు వీరయ్య సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆయన వరసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తనపై వచ్చిన ఆరోపణలు, కొందరు రాజకీయంగా చేస్తున్న కామెంట్స్ కి బదులు చెబుతున్నారు. ఇటీవల రోజా… పవన్ ని విమర్శించే క్రమంలో చిరంజీవి, నాగబాబులను కూడా విమర్శించారు. వారు సొంత నియోజ...

January 11, 2023 / 08:25 PM IST

అంబటి రాంబాబు మెడకు కోర్టు కేసు..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంబాబు ఊహించిన చిక్కు ఎదురైంది.  ఆయన మెడకు ఓ కోర్టు కేసు వచ్చి చుట్టుకుంది.  ఇంతకీ మ్యాటరేంటంటే… అంబటి రాంబాబు సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో టిక్కెట్లు అమ్మకాలు చేస్తున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరా రావు కోర్టులో పిటిషన్ వేశారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టుకు వివరించారు. మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంల...

January 11, 2023 / 09:14 PM IST

చంద్రబాబు స్పెషల్ ట్వీట్ కి… ఎన్టీఆర్ రిప్లై..!

పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్…  కి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఆ సినిమాలోని నాటు నాటు పాటకు.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందుకున్నారు. ఈ అవార్డు కార్యక్రమానికి డైరెక్టర్ రాజమౌళి,ఆయన సతీమణి రమ, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా హాజరయ్యారు. కాగా… ఈసినిమా కోసం పనిచేసిన చిత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్ర...

January 11, 2023 / 08:03 PM IST

పవన్ సీఎం కావాలని నాకైతే లేదు, మరోసారి జగనే సీఎం: మంత్రి కొట్టు సత్యనారాయణ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో భేటీ కావడంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . తాజాగా మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా ఫైర్ అయ్యారు. తనకు వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ అంటే అభిమానమే అంటూ చెప్పారు. అదీ సామాజిక వర్గం పరంగా ఏర్పడిందే అని సెలవిచ్చారు. కానీ పవన్ వైఖరి మాత్రం తమ సామాజిక వర్గం బాధపడేలా ఉందని పేర్కొన్న...

January 11, 2023 / 06:31 PM IST

మాజీమంత్రి నారాయణపై సీఐడీ ప్రశ్నల వర్షం, ఆఫీసులో అర్ధరాత్రి వరకు తనిఖీలు

మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణకు చెందిన విద్యాసంస్థల కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు నిన్న (మంగళవారం) మరోసారి సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌ మిలాంజ్ టవర్స్ పదో అంతస్తులో గల ఆఫీసుకు ఉదయం 10 గంటలకు 40 మంది అధికారులు చేరుకుని, అర్ధరాత్రి వరకు తనిఖీలను చేపట్టారు. పలు హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని వై...

January 11, 2023 / 06:15 PM IST

పవన్ కళ్యాణ్ యువశక్తి ప్రోగ్రాంకు అంతా సిద్ధం!

శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనవరి 12వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి బహిరంగ సభకు అంతా సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జరుగనుంది. ఈ సభలో జనసేన పార్టీ 100 మంది యువతకు నిరుద్యోగం, ఉపాధి, అభివృద్ధి తదితర అంశాలపై ప్రసంగించేందుకు అవకాశమిస్తారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు అక్కడి నుండి ప్రసంగించనున్నారు. ఈ యువ శక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు మరింత...

January 11, 2023 / 06:10 PM IST

సోషల్ మీడియాపై సోమువీర్రాజు స్పెషల్ ఫోకస్..!

ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి తగినంత గుర్తుంపు సంపాదించుకోవడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగానే సోషల్ మీడియాపై స్పెషల్ ఫోకస్ పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  బీజేపీ నేత సోము వీర్రాజు.. తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.  సోషల్‌ మీడియా వేదికను నాయకులు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని  ఆయన పార్టీ నేతలకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తున్న అభివృద్ధి...

January 11, 2023 / 06:00 PM IST

ప్రత్యేక హోదా కోసం బస్సు యాత్ర…!

రాష్ట్ర విభజన తర్వాత…. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశం మరుగునపడిపోయింది.  కేంద్రంలో ప్రభుత్వం మారడంతో…. కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఎంత మంది నేతలు అడిగినా… కేంద్రం స్పందించలేదు. మళ్లీ… అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో… మ‌రోసారి విభ‌జ‌న హామీలు, ప్ర‌త్యేక హోదా తెర‌మీద‌కు వ‌చ్చాయి. ప్ర‌త్యేక హోదా సాధిస్తామ‌న...

January 11, 2023 / 05:56 PM IST

రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుంది.. వసంత కృష్ణ ప్రసాద్..!

మైలవరం ఎమ్మెల్యే, వైసీపీ నేత వసంత కృష్ణ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఒక్కోసారి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయాలు చూస్తూనే ఉన్నానని చెప్పారు. తాను చిన్నతనంలో తన తండ్రి రాజకీయాల్లో ఉన్నారని ఆయన అన్నారు. అయితే…. ఒకప్పటి రాజకీయాలకీ, ఇప్పటి రాజకీయాలకీ  చాలా తేడాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఒక్కోసారి రాజకీయాల్లో...

January 11, 2023 / 05:48 PM IST

చంద్రబాబుతో రజనీకాంత్ భేటీ..? కారణమిదేనా..?

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ నేతలతో సినీ ప్రముఖుల భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. చంద్రబాబు- రజనీ మంచి స్నేహితులు.. కానీ రాజకీయ కోణం కూడా ఉంటుంది. నిజానికి రజనీకాంత్‌కు తమిళనాడులో అభిమానులు ఎక్కువ. తలైవా అంటూ ఆరాధిస్తారు. ఆయనను రాజకీయ పార్టీ పెట్టాలని కోరాగా మక్కల్ మంద్రం పేర...

January 10, 2023 / 10:32 PM IST

మీ ఇద్దరిలో ముఖ్యమంత్రి ఎవరు?: పవన్-చంద్రబాబులకు మిథున్ ప్రశ్న

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ రెండురోజుల క్రితం కలుసుకోవడంపై వైసీపీ నాయకుల విమర్శలు, ప్రశ్నలు ఆగటం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, రోజా, విడదల రజని… ఇలా వరుసపెట్టి సెటైర్లు వేస్తున్నారు. గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని పరామర్శించని పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబును కలవడం విడ్డూరంగా ఉందని విడదల రజని నిన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా, ఎంపీ మిథు...

January 10, 2023 / 10:20 PM IST

అమరావతి రాజధాని అంశంపై సుప్రీం కోర్టు నోటీసులు

రాజధాని అమరావతి అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జగన్ ప్రభుత్వం గతంలో పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులైన రైతులు, వివిధ పార్టీల నేతలు, మంత్రులు, పలువురు అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ...

January 10, 2023 / 10:12 PM IST

కాల్వ శ్రీనివాసులు వర్సెస్ కాపు రామచంద్రారెడ్డి : అక్రమాలపై కదంతొక్కిన నేత, అరెస్ట్

అనంతపురంలో టీడీపీ, వైసీపీ ముఖ్య నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డిని టీడీపీ ముఖ్య నేత కాల్వ శ్రీనివాసులు టార్గెట్ చేస్తున్నారు. జిల్లాలో ఇసుక మాఫియా, మద్యం సప్లై, ఆయుధాల సరఫరా, నకిలీ నోట్లు, జిలెటిన్ స్టిక్స్ వంటి  అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటిపై సమగ్ర విచారణ చేపట్టాలని రాయదుర్గం నియోజకవర్గంలో గల ఉద్దేహాల్ నుంచి తిమ...

January 10, 2023 / 07:43 PM IST

వారిలో టెన్షన్: టీడీపీ-జనసేన పొత్తు వైసీపీకే ఎక్కువ లాభమా?

టీడీపీ-జనసేన పొత్తు: 14లో వలె తీపా, 19వలె చేదా? తెలుగుదేశం-జనసేన పొత్తు ఆ పార్టీల అధినేతలకు కొత్త తలనొప్పి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో అంచనాలతో వైసీపీకి 151 సీట్లతో ప్రజలు గెలిపిస్తే, అన్నింటా ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్లుగా చెబుతున్నారు. జగన్ పాలనపై ఓ రకమైన అసంతృప్తి ఉంటే, దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు ఆ...

January 10, 2023 / 07:36 PM IST

లోకేష్ పాదయాత్రకు జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ త్వరలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర కోసం టీడీపీ పోలీసుల అనుమతిని కోరింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)కి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. జనవరి 27వ తేదీన ప్రారంభమయ్యే తమ పార్టీ నాయకుడికి 400 రోజుల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఈ పాదయాత్ర కుప్పం నుండి...

January 10, 2023 / 07:16 PM IST