రాష్ట్ర విభజన తర్వాత…. ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశం మరుగునపడిపోయింది. కేంద్రంలో ప్రభుత్వం మారడంతో…. కాంగ్రెస్ ఇచ్చిన హామీని బీజేపీ పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఎంత మంది నేతలు అడిగినా… కేంద్రం స్పందించలేదు. మళ్లీ… అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో… మరోసారి విభజన హామీలు, ప్రత్యేక హోదా తెరమీదకు వచ్చాయి.
ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన తెలుగుదేశం పార్టీ విఫలం కావడంతో, ప్రజలు వైసీపీని గెలిపించారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్ హామీ ఇవ్వడంతో ప్రజలు ఆయనకు చాన్స్ ఇచ్చారు. జగన్‌కు 32 మంది ఎంపీల మద్ధతు ఉన్నా హోదా మాట ఎత్తకపోవడంతో ప్రజలు రివర్స్ అయ్యే అకవాశం ఉన్నది. కాగా, ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం విద్యార్థి, యువజన సంఘాల నేతృత్వంలో బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.
జనవరి 20 వ తేదీ నుండి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానున్నది. అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గం నుండి బస్సుయాత్ర ప్రారంభమయ్యి ఇచ్చాపురం వరకు నడుస్తుంది. ఈ యాత్రకు తెలుగుదేశం, కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీని ఏపీ ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఆయన ఏపీకి చేసిన అన్యాయంపై కోపంగా ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు ప్రజల నుండి మద్దకు ఉందని, బీజేపీ నుండి బయటకు వస్తే మంచి ఆదరణ లభిస్తుందని చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు. బస్సు యాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని లేదంటే న్యాయస్థానానికి వెళ్లి అనుమతులు తెచ్చుకుంటామని అన్నారు.