ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుతో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ నేతలతో సినీ ప్రముఖుల భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. చంద్రబాబు- రజనీ మంచి స్నేహితులు.. కానీ రాజకీయ కోణం కూడా ఉంటుంది. నిజానికి రజనీకాంత్‌కు తమిళనాడులో అభిమానులు ఎక్కువ. తలైవా అంటూ ఆరాధిస్తారు. ఆయనను రాజకీయ పార్టీ పెట్టాలని కోరాగా మక్కల్ మంద్రం పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. కానీ అదీ ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అనారోగ్య కారణాలు చెప్పి తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్‌కు రజనీకాంత్ దూరంగా ఉన్నారు. మక్కల్ మంద్రంను తిరిగి ఫ్యాన్స్ క్లబ్‌గా మార్చేశారు. పొలిటికల్ పార్టీగా మార్చే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు.
రజనీకాంత్ సోమవారం హైదరాబాద్ వచ్చారు. షూటింగ్ కోసం వచ్చిన ఆయన.. చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. దీంతో రాజకీయానికి ఏమైనా ఛాన్స్ ఉందా అనే డిస్కసన్ తెరపైకి వచ్చింది. 40 నిమిషాల భేటీలో ఇరువురు ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఇది కామనే.. కానీ వచ్చే ఎన్నికల గురించి చంద్రబాబు ప్రస్తావించి ఉంటారు. ఎలాగూ రజనీ పార్టీని తిరిగి ఎస్టాబ్లిష్ చేయరు. కానీ తమకు ప్రచారం చేసి పెట్టాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీలో జగన్‌కు వ్యతిరేకత ఉందని బాబు అంటున్నారు. దానిని తన ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు సినీ సెలబ్రిటీలను రంగంలోకి దింపాలని బాబు ఆలోచన. ఇంటికి వచ్చిన అతిథిని కూడా ఓ మాట అడిగేస్తే పోలా అని.. అనుకుంటారని విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబు అడిగినా.. ఇతరులు కోరినా రజనీ మాట ఒక్కటే అని మరికొందరు ఆనలిస్టులు చెబుతున్న మాట. ఆయనకు రాజకీయాలు సరిపోవు.. ప్రచారం కూడా చేయరని తేల్చిచెబుతున్నారు. అందుకోసమే పెట్టిన పార్టీనే ఫ్యాన్స్ క్లబ్‌గా మార్చివేశారని గుర్తుచేశారు. కానీ వీరి భేటీ మాత్రం పొలిటికల్ సర్కిళ్లలో డిస్కసన్కు తెరతీసింది. రజనీకాంత్ బీజేపీకి అనుకూలంగా ఉంటారు. మొన్న పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ జరిగింది. పవన్ కూడా బీజేపీకి ప్రోగా ఉంటారు. సో.. వరసగా జరుగుతున్న పరిణామాలను చూస్తే.. బీజేపీతో మైత్రికి అవకాశం ఉంటుంది. అంతకుముందు బీజేపీతో చంద్రబాబు సన్నిహితంగా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో మాత్రం డిస్టన్స్ మెయింటెన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు బీజేపీతో పొత్తుకు ట్రై చేస్తున్నారని చర్యల వల్ల అర్థమవుతోంది.
రజనీకాంత్ కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. సినిమాల ద్వారానే అతనికి ఆదాయం వస్తోంది. యాడ్స్ చేయరు. అలా చేయడం అంటే ఆయనకు పెద్దగా నచ్చదు. ఒక్కో సినిమాకు రూ.60 కోట్ల వరకు సంపాదిస్తారు. ఒకవేళ సినిమా నష్టపోతే, తీసుకున్న డబ్బులను ఇచ్చేస్తారు. ఆయనది ఉదార స్వభావం. నిర్మాతలు కూడా రజనీకాంత్ గొప్ప మనసును ప్రశంసిస్తూనే ఉంటారు. అతని మొత్తం ఆస్తి రూ.400 కోట్ల వరకు ఉంటుంది. సంపాదనలో ఎక్కువ దాన, ధర్మలకే ఖర్చు పెడతారు. మిగతా హీరోల మాదిరిగా.. స్టార్స్ మాదిరిగా హై ప్రొఫైల్ మెయింటెన్ చేయరు. అతను రోడ్డు పక్కన లభించిన ఫుడ్ తీసుకునే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇంత సింపుల్‌గా ఉన్నందునే రజనీ అంతమంది అభిమానులను సంపాదించుకోగలిగారు.