శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనవరి 12వ తేదీన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి బహిరంగ సభకు అంతా సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమం జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జరుగనుంది. ఈ సభలో జనసేన పార్టీ 100 మంది యువతకు నిరుద్యోగం, ఉపాధి, అభివృద్ధి తదితర అంశాలపై ప్రసంగించేందుకు అవకాశమిస్తారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు అక్కడి నుండి ప్రసంగించనున్నారు. ఈ యువ శక్తి ప్రోగ్రామ్ ద్వారా యువతకు మరింత చేరువయ్యేందుకు అవకాశం ఉంటుంది.
ఈ యువశక్తి ప్రోగ్రామ్‌కు అనుమతి ఇచ్చామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేష్ తెలిపారు. ఎలాంటి ర్యాలీని నిర్వహించేందుకు ఆర్గనైజర్లకు అవకాశం రాలేదు. ఆర్గనైజర్లు ప్రయివేటు సెక్యూరిటీని కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున యువత పాల్గొంటుందని భావిస్తోంది. యువశక్తి ప్రోగ్రామ్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వివిధ సమస్యలను హైలెట్ చేయాలని భావిస్తున్నారు. యువతకు కూడా ఇది మోటీవేటివ్ అవుతుందని భావిస్తోంది జనసేన.
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనవరి 12న ఈ సభను నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని యువత గళం వినిపించేలా ఈ సభ ఏర్పాటు చేస్తున్నారు. జనసేన నిర్వహిస్తున్న ఈ సభకు యువత అందరూ ఆహ్వానితులే. ఉత్తరాంధ్ర వాసుల వలసలు, ఉపాధి, విద్యావకాశాలు, వ్యాపార అవకాశాలు, ఇతర సమస్యలపై యువత అభిప్రాయాలు తెలియజేసేందుకు ఈ భారీ బహిరంగ సభ వేదిక కానుంది. ఉత్తరాంధ్ర పరిస్థితులు, సమస్యలతోపాటు కష్టాల నుంచి విజయాలు సాధించిన వారి గొప్ప స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పేందుకే యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.