ఏలూరు జిల్లా దెందులూరు వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి పైన ఓ ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పదకొండు మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం ప్రయివేటు ట్రావెల్స్ ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుండి విజయనగరం వెళ్తోంది. దెందులూరు వద్ద ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు. ముగ్గురు డ్రైవర్లు ఉన్నారు. సమాచారం తెలియగానే దెందూలురు ఎస్సై వీరరాజు, హైవే పెట్రోలింగ్ పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.