»Operation Kaveri Shuroo Cm Jagans Actions To Protect The Telugu People
Sudan : ఆపరేషన్ కావేరి’ షురూ.. తెలుగు వారిని కాపాడేందుకు సీఎం జగన్ చర్యలు
ఆఫ్రికా దేశం సూడాన్ లో ఆర్మీ, శక్తిమంతమై పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో, సాధారణ పౌరులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో, సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
ఆఫ్రికా దేశమైన సుడాన్(Sudan)లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. ఇప్పటికే సుమారు 500 మంది వరకు సాధారణ పౌరులు మరణించగా, 3,500 మంది గాయపడ్డారు. మృతుల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. సంక్షోభంలో ఉన్న సుడాన్లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా భారత్‌కు తరలించేందుకు ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri) మిషన్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సుడాన్ పోర్ట్‌కు చేరుకున్నారు. భారత నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్(INS) సుమేధ ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నది. సుడాన్లో చిక్కుకున్న భారతీయులను ఐఎన్ఎస్ సుమేధ, ఐఏఎఫ్ (IAF) విమానాల ద్వారా భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(S Jaishankar) తెలిపారు. ఈ మిషన్‌ను ‘ఆపరేషన్ కావేరి’గా పేర్కొన్నారు
కాగా, వార్ జోన్ దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, (Afghanistan) ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతోపాటు విదేశీయుల తరలింపునకు ‘ఆపరేషన్ కావేరీ’ మిషన్‌ను భారత్ చేపట్టింది. తాజాగా సుడాన్ నుంచి భారతీయులు, ఇతర దేశీయుల తరలింపునకు మిత్ర దేశాలతో కలిసి ఈ మిషన్‌ను కొనసాగిస్తున్నది. సోమవారం ఫ్రాన్స్ కూడా సుడాన్ నుంచి 388 మందిని తరలించింది. ఐదుగురు భారతీయులతోపాటు 28 దేశాలకు చెందిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.ఆఫ్రికా దేశం సూడాన్ లో ఆర్మీ, శక్తిమంతమై పారా మిలిటరీ దళాల మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో, సాధారణ పౌరులు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో, సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
ఏపీ సీఎం జగన్ (CM JAGAN) కూడా సూడాన్ సంక్షోభంపై స్పందించారు. అంతర్యుద్ధం కారణంగా సూడాన్ లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వారిని క్షేమంగా వెనక్కి రప్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. స్వదేశానికి రాగానే వారిని స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్ (Ukraine) సంక్షోభం సమయంలో వ్యవహరించిన విధంగానే… సూడాన్ నుంచి తిరిగొచ్చే వారి కోసం విమాన టికెట్లు, ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విమానాశ్రయంలో వారిని రిసీవ్ చేసుకుని, అక్కడ్నించి వారు తమ స్వస్థలాలకు చేరుకునే వరకు అధికారులు అండగా నిలవాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, సూడాన్ (Sudan) లో 56 మంది వరకు తెలుగువారు ఉన్నట్టు భావిస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు.