Kothagudem : మరో వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్
తన తాత, అమ్మమ్మలు దగ్గర్లో మసీదుకు తీసుకెళ్లి తాయత్తు కట్టించారని… ఆ తాయత్తు వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్ డైరెక్టర్ గా(Director of Health) ఉండి డాక్టర్ల విశ్వాసం దెబ్బతినేలా ఈ వ్యాఖ్యలు ఏమిటని పలువురు విమర్శిస్తున్నారు.
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు(Gadala Srinivasa Rao) మరో వివాదంలో చిక్కున్నారు. తాజాగా కొత్తగుడెం (Kothagudem) లో జరిగిన ఇఫ్తార్ విందులో చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన చర్యలు తీసుకోవాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్(Good governance) తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్మికి లేఖ రాసింది. శ్రీనివాస్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా ఇఫ్తార్ విందు (Iftar feast) సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైద్యులు తగ్గించలేని జబ్బును తాయెత్తు తగ్గించిందని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. గతంలో కొవిడ్ (Covid) పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. యేసు క్రీస్తు (Jesus Christ) కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.., మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ శ్రీనివాసరావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగూడెం శ్రీనగర్ కాలనీ DSR క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. డీజే టిల్లు (DJ Tillu) పాటకు డ్యాన్స్ చేశారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో పూజల్లో ఎండు మిరపకాయలు హోమంలో వేస్తూ కనిపించడం కలకలం రేపింది.