Tadipatri: ముద్దులు పెట్టి ఇద్దరం దొంగలమే అంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి
ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ప్రధాన కూడళ్ళలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు.
Tadipatri: ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. ప్రధాన కూడళ్ళలో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జెసి ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా డీజిల్ దొంగ ఎవరంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలను మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. ఫ్లెక్సీలో ఉన్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫోటోపై ముద్దుల వర్షం కురిపించారు. తాడిపత్రి పట్టణంలో టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఇరు వర్గాలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఫ్లెక్సీలు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే జేసీని ఉద్దేశించి ప్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… డీజిల్ దొంగ ఎవరో? తేల్చాలన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న గజదొంగ కేతిరెడ్డి అని, ప్రజల మనసు దోచుకున్న గజదొంగను తాను అని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తన గుండె తాడిపత్రి అంటుందంటూ జేసీ షర్టు విప్పి చూపించారు. ఫ్లెక్సీలు తాను కూడా కడతానని, గజదొంగ ఎవరో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఎంఎల్ఎ కేతిరెడ్డికి ఒక సంవత్సరం మాత్రమే ఉందని, ఏం తింటావో తిను అని మండిపడ్డారు. పుట్లూరు యల్లనూరు మండలంలో దొంగతనం చేసుకునే వాడివని.. దొంగతనాలు చేసుకోమని తెలిపారు.