ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి(Purandeshwari)పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. గత కొద్ది రోజులుగా పురందేశ్వరి సాయిరెడ్డి మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉండి టీడీపీ కోవర్ట్లా పని చేస్తున్నారని విజయిసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ఈడీ, సీబీఐ (CBI) ఐటీ కేసుల్లో బెయిల్పై ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటే విజయిసాయిరెడ్డి(Vijayasai Reddy)ని పురందేశ్వరి టార్గెట్ చేశారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరి! ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్నఅధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త, మీ బావ గారితో చేతులు కలిపారన్నారు.
పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆపెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే. ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా..!’’ అని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.ఇదిలా ఉండగా..చంద్రబాబు(Chandrababu)కు బెయిల్ లభించడం పట్ల పురందేశ్వరి స్పందించారు. విపక్ష నేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు (High Court) మధ్యంతర బెయిల్ ఇచ్చిందన్న వార్త చాలా సంతోషం కలిగించిందని ఆమె వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ దగ్గర నుండి వీరి ఇద్దరు మధ్య మాటల యుద్దం మొదలైంది.