తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (tdp national general secretary) నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuva Galam Padayatra) ఉరవకొండ నియోజకవర్గంలో (uravakonda constituency) కొనసాగుతోంది. ఇక్కడ ఆయనకు ప్రమాదం తప్పింది. ఈ నియోజకవర్గంలోని కూడేరులో పాదయాత్ర సందర్భంగా టీడీపీ అభిమానులు (Telugu Desam Activists) ఆయనను గజమాలతో (Gajamala) సత్కరించే సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ గజమాలను క్రేన్ సహాయంతో లోకేష్ కు (Nara Lokesh) వేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో క్రైన్ వైర్లు తెగిపోయాయి. దీంతో మాల ఆయన పైన పడింది. వైర్లు తెగిన విషయం గమనించిన లోకేష్ (nara lokesh)వెంటనే అప్రమత్తమై తప్పించుకున్నాడు. దీంతో ఆయనకు పెను ప్రమాదం (accident) తప్పింది. లోకేష్ కు (nara lokesh) ఏం కాకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసు భద్రతా లోపాలపై (police security) తెలుగు దేశం కార్యకర్తలు (Telugu Desam Party activists) ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ను పోలీస్ భద్రతా లోపాలు (police security) వెంటాడుతూ ఉన్నాయని వారు అంటున్నారు. భద్రతా లోపం కారణంగా కదిరిలో లోకేష్ కుడి భుజానికి గాయం అయింది. ఒక్కసారిగా జనాలు మీద పడటంతో రెండు వారాలుగా లోకేష్ ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడేరులో మరోసారి భద్రతా లోపం కనిపించింది. ఇదిలా ఉండగా, నేడు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (babu jagjeevan ram jayanthi) నేపథ్యంలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు. ‘స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించాను. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి.’ అని పేర్కొన్నారు.