»Murder Twist In The Case Of Software Engineer Brother Is A Victim Of Extramarital Affair
Tirupati District : సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్య కేసులో దారుణం..తమ్ముడు వివాహేతర సంబంధానికి బలి..
తిరుపతి జిల్లాలో(Tirupati District) కలకలం సృష్టిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) నాగరాజు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమ్ముడు వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు. మహిళ తరుపున బంధువులు అన్నను దారుణంగా హత్య చేశారు.తమ్ముడి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు (Police) ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
తిరుపతి జిల్లాలో(Tirupati District) కలకలం సృష్టిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ (Software Engineer) నాగరాజు హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తమ్ముడు వివాహేతర సంబంధానికి అన్న బలయ్యాడు. మహిళ తరుపున బంధువులు అన్నను దారుణంగా హత్య చేశారు.తమ్ముడి వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు (Police) ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పక్క ప్లాన్ ప్రకారమే నాగరాజు హత్య (Nagaraj’s murder) జరిగినట్లు చంద్రగిరి సీఐ ఓబులేష్ (CI Obulesh) మీడియాకు కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించారు.రూపంజయ, చాణక్య సహా మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఓబులేష్ తెలిపారు. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతన్నామని, త్వరలోనే మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు. నాగరాజు హత్యపై ఆయన భార్య స్పందించింది.’రాత్రి గోపీ అనే వ్యక్తి నా భర్తకు ఫోన్ చేశాడు.
నా భర్త తమ్ముడు పురుషోత్తం (Purushottam) గొడవ విషయంపై ఫోన్ చేశారు. మాట్లాడేందుకు పిలిచి నా భర్తను హత్య చేశారు. పురుషోత్తం వివాహేతర సంబంధంపై(extramarital affair) గొడవలు జరుగుతున్నాయి. పురుషోత్తానికి మరో వ్యక్తి భార్యతో రిలేషన్ షిప్ ఉంది. శివరాత్రి రోజు వారిద్దరు కలుసుకున్నారని గొడవ చేశారు. సర్పంచ్ చాణక్య (Sarpanch Chanakya), సుబ్బన్న నా భర్తను హత్య చేశారు. గొడవతో సంబంధం లేని నా భర్తను హత్య చేశారు. నా మరిది రుపేంజేయ భార్యతో అక్రమ సంబందం కలిగి ఉన్నాడనే నెపంతోనే నా భర్తను హత్య చేశారు. రాజీ చేస్తామని చెప్పి పిలిపించి కారుతో సహా కాల్చారు. నాకు న్యాయం చేయకపోతే వారిని చంపేస్తాం . నిందితులను కఠినంగా శిక్షించాలి’ అని నాగరాజు భర్య సులోచన తెలిపింది. సంఘటన స్థలంలో చల్లాచదురుగా రోడ్డుపై మెడలోని చైన్, దుస్తులు, చెప్పులు పడివుండటంతో పోలీసులు హత్య చేసినట్లు గుర్తించారు. అయితే.. సజీవ దహనం (Burning alive) చేసి కారును లోయలోకి తోసి ప్రమాదంగా దుండగులు చిత్రీకరించే యత్నం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు, క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.