Roja Counter to TDP : టీడీపీ నేతలు పిచ్చెక్కిపోతున్నారు… మంత్రి రోజా..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీ నేతల్లో మంచి కిక్ ఇచ్చింది. ఆ ఆనందాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే... ఈ విషయం అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.అందుకే టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మంత్రి రోజా కూడా ఈ విషయంపై స్పందించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీడీపీ నేతల్లో మంచి కిక్ ఇచ్చింది. ఆ ఆనందాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే… ఈ విషయం అధికార పార్టీ నేతలకు మింగుడుపడటం లేదు.అందుకే టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా.. మంత్రి రోజా కూడా ఈ విషయంపై స్పందించారు.
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలవగానే మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనంటూ టిడిపి నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. 2019లో ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఒక్క ఎన్నికలో కూడా టిడిపి గెలవలేదని… దీంతో, ఆ పార్టీ నేతలు పిచ్చెక్కిపోయారని అన్నారు. శవాల నోట్లో తీర్థం పోసినట్టుగా టిడిపికి ఊహించని విధంగా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆ ఎమ్మెల్సీలు పార్టీ సింబల్ తో, సొంత ఓట్లతో గెలవలేదని చెప్పారు. అయినా ఏదో ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. టిడిపి నేతలు అహంకారం నెత్తికెక్కి అసెంబ్లీలో స్పీకర్ ను అవమానించి, ఆయనపై దాడి చేయడం దారుణమని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా మళ్లీ జగనే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.