ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏపీలో కాక రేపుతోంది. ట్యాపింగ్‌పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. విచారణ జరపాలని అందులో హోం మంత్రి అమిత్ షాను కోరారు. ట్యాపింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తిగత అంశాలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నారని తెలిపారు. తన వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొన్నారు. ట్యాపింగ్ చేశారని చెబితే వైసీపీ నేతలు/ ఎమ్మెల్యేలు తనపై మాటల యుద్దం చేశారని గుర్తుచేశారు. ఈ విషయంపై తేల్చుకునేందుకు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరులో పోటా పోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తలతో కోటంరెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తుండగా, కార్పొరేటర్లను ఆదాల కలుస్తున్నారు. నెల్లూరు మేయర్ సహా 8 మంది కార్పొరేటర్లు కోటంరెడ్డి వర్గం.. మెజార్టీ కార్పొరేటర్లు (18 మంది) ఆదాలను కలిశారు. ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ చేయాలని భరోసా ఇచ్చారు. ఇష్యూ పరిష్కారం చేస్తానని చెప్పారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గల సమస్యలను కోటంరెడ్డి ప్రస్తావించారు. ఇంకా 70 శాతం పనులు కావాల్సి ఉందన్నారు. రూ.10 కోట్ల నిధులు కేటాయించాలని కోరారు. లేదంటే కాంట్రాక్టర్లకు గట్టిగా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్రిమెంట్ ప్రకారం రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. కొన్ని చోట్ల రెండు వైపులా రోడ్డు వేయలేదని చెప్పారు. చాలా మంది వెళ్లే చోట ఇలానే అని మండిపడ్డారు.
నెల్లూరు రూరల్‌లో అధ్వాన్నంగా ఉన్న రోడ్లని పూర్తి చేయాలని కోరారు. పొదలకురు రోడ్డులో 3 కిలోమీటర్లు ఒక పక్కే వేశారు. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. సీఎం జగన్ చూసి రూ.28 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఆ సమస్య పరిష్కారం కాలేదు. ముస్లిం, దళితులు, గిరిజనుల గురుకుల పాఠశాల పూర్తి కాలేదు. వావిలేటుపాడులో 3 వేల మందికి ఇచ్చిన ఇళ్ల సమస్య నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. దర్గామిట్టలోని బీసీ భవన్‌కి నిధులు మంజూరు కాలేదు. అంబేద్కర్ భవన్, లైబ్రరీ పునాది దశలో నిలిచిపోయాయి. గణేష్ ఘాట్ రూ.15 కోట్ల 20 లక్షలు కేంద్రం నిధులు విడుదల చేశారు. అధికారుల సహకరించడం లేదు. దీంతో పనులు జరగడం లేదు. రూ.30 లక్షల మందితో కులాలకు అతీతంగా జరిగే రొట్టెల పండుగ ప్రాంతంలో రూ.15 కోట్లు అడిగితే సీఎం స్పందించి జీవో ఇచ్చారు. సీఎం ఇచ్చిన హామీతో శంకుస్థాపన చేసినా.. ఇంత వరకు నిధులు విడుదల చేయలేదు. సీఎంని కలిసి అడిగితే వెంటనే పూర్తి చేయమని అధికారులకి చెప్పారు. నెలలు గడుస్తున్నా పరష్కారం కావడం లేదని కోటంరెడ్డి పేర్కొన్నారు.