Chandrababu is the only one in the quota and the only one in the Peta
Kodali Nani: మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత కొడాలి నాని (Kodali Nani) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు.. తనకు హాట్ వాటర్ ఇవ్వడం లేదని.. దోమలు కుడుతున్నాయని, ఏసీ లేదని కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇదే అంశంపై కొడాలి నాని స్పందిస్తూ.. జైలులో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనక వచ్చి కన్ను కొడతారా అని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఉన్నంత వరకు వైసీపీ విజయానికి ఢోకా లేదని చెప్పారు.
చంద్రబాబు అరెస్ట్‌తో లోకేశ్ తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని కొడాలి నాని విమర్శించారు. కొట్టండి, జైలులో పెట్టండి, నిరూపించండి అన్న లోకేశ్.. బెయిల్ కోసం ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని నిలదీశారు. ఆడెవడో స్టార్ వస్తే లోకేశ్ అన్నయ్య అంటాడు.. ఓ పక్కన అన్నయ్య.. మరోపక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేశ్ అనుకుంటున్నాడు. 2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరి అంటున్నారని.. ఆ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులైమేనా పంచుతారా అని అడిగారు.
జైలులో వసతుల్లేవు. వేడి నీళ్లు లేవని భువనేశ్వరి అంటున్నారు.. ఏసీ, ఫ్రిజ్, కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదని కొడాలి నాని అన్నారు. జైలులో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలని సూచించారు. బాబు అరెస్ట్ గురించి మాట్లాడాలని పక్క రాష్ట్రానికి చెందిన నేతలను బతిమి లాడుతున్నారని గుర్తుచేశారు. అందుకే కొందరు ట్వీట్స్ చేస్తున్నారని.. బాబుతో నేను అని కార్యక్రమాలు చేశానని చెబుతున్నారు. మరీ జైలుకు వెళ్తారా అని అడిగారు. బాబు కోసం ఎవరూ పాదయాత్రలు చేయరు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రం కార్లతో యాత్రలు చేస్తారని గుర్తుచేశారు.
బీసీ, ఎస్సీలు నిరసనలు చేయడం లేదని.. ఎందుకంటే అధికారంలో ఉండగా.. చంద్రబాబు వారికి పదవులు ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినవి అన్నీ స్కాములేనని తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్ కూడా అదేనని కొడాలి నాని వివరించారు.