Asaduddin Owaisi:ఏపీ పాలిటిక్స్ గురించి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల గురించి మాట్లాడారు. జైలులో చంద్రుడు హ్యాపీగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు అంటూనే ఛలోక్తులు విసిరారు. సీఎం జగన్ గురించి పాజిటివ్‌గా మాట్లాడారు. జగన్ పాలన ఫర్లేదు అని కితాబిచ్చారు.
జగన్ పాలనను మెచ్చుకుంటూనే.. ఏపీలో తమ పార్టీ రావాల్సిన అవసరం ఉందని వివరించారు. తన చేతిలో ఏ మాయ, మంత్రం లేదు కానీ.. పార్టీ విస్తరించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి వక్కానించారు. మజ్లిస్ పార్టీ పాతబస్తీలో బలంగా ఉంది. తెలంగాణ అసెంబ్లీలో 5, 6 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంటోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా.. ఇటీవల మహారాష్ట్రలో కూడా సత్తా చాటుతోంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఏపీ నజర్ పెట్టింది.
చంద్రుడు జైల్లో హ్యాపీగా ఉన్నారు – ఒవైసీ
చంద్రబాబు అరెస్టుపై స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. జైల్లో చంద్రుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో మజ్లీస్ దోస్తి కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు వేయాలని.. మజ్లిస్ పోటీ చేయని చోట బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. బీఆర్ఎస్- మజ్లిస్ ఒక్కటేనని తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఆ రెండు పార్టీలపై విమర్శలు చేశారు. ఆ తర్వాత అసదుద్దీన్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ తనపై పోటీచేయాలని సవాల్ విసిరారు. ఎక్కడో వాయనాడులో కాదని.. హైదరాబాద్‌లో బరిలోకి దిగాలని ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. రాహుల్‌ను విమర్శించే స్థాయి అసదుద్దీన్‌ది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు కౌంటర్ ఇచ్చారు.