Kodali Nani : ఇటీవల ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారేలా చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి బాధ్యలను చేస్తూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
ఇటీవల ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారేలా చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి బాధ్యలను చేస్తూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీనిని టీడీపీ తమకు అనుకూలంగా చేసుకుంది. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో… టీడీపీ నేతలకు కొడాలి నాని కౌంటర్లు వేశారు. ముఖ్యంగా బాలకృష్ణ తమకు 40మంది టచ్ లోకి వచ్చారంటూ చెప్పడంపై నాని ఘాటుగా స్పందించారు.
ఎవరు ఎవరితో టచ్లో ఉన్నా… జగన్కు వచ్చే నష్టమేమీ లేదన్న నాని.. ఎన్నికల వేళ లీడర్లు ఎవరైనా `.. ప్రజలతో టచ్లో ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. 2019లో జగన్ చేతిలో అల్లుళ్లకు పట్టిన గతే.. బావ చంద్రబాబు, బావమరిది బాలయ్యలకు పడుతుందన్నారు. వై నాట్ అంటున్న నందమూరి బాలయ్య కు.. ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చూపిస్తారన్నారు
నందమూరి బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్లను ఇంటికి పంపించినట్లే.. ఇటు బావ, బావమరుదులైన బాలయ్య, చంద్రబాబులను వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతారన్నారు. విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టనని జగన్ అంటున్నారని.. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి జగన్ సీట్లు ఇవ్వరన్నారు. ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా సీట్లు ఇస్తారన్నారు.